iDreamPost
android-app
ios-app

ఒక్క మార్పుతో ఫైనల్‌ బరిలోకి.. ఇండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

  • Published Nov 18, 2023 | 10:02 PMUpdated Nov 18, 2023 | 10:02 PM

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరుకు టీమిండియా రెడీగా ఉంది. ఆస్ట్రేలియాను మరోసారి ఓడించి.. వరల్డ్ కప్‌ వేటను విజయవంతంగా ముగించాలని కోరుకుంటుంది. అందుకోసం జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలాంటి మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరుకు టీమిండియా రెడీగా ఉంది. ఆస్ట్రేలియాను మరోసారి ఓడించి.. వరల్డ్ కప్‌ వేటను విజయవంతంగా ముగించాలని కోరుకుంటుంది. అందుకోసం జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలాంటి మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 18, 2023 | 10:02 PMUpdated Nov 18, 2023 | 10:02 PM
ఒక్క మార్పుతో ఫైనల్‌ బరిలోకి.. ఇండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

ఒక్క అడుగు.. మూడో సారి ప్రపంచ కప్‌ గెలిచేందుకు టీమిండియా కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. 1983, 2011 వన్డే వరల్డ్‌ కప్స్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత్‌.. మరోసారి అలాంటి మధుర క్షణాలను తిరిగి పొందేందుకు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆదివారం ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో నెగ్గితే.. ముచ్చటగా మూడోసారి భారత్‌ క్రికెట్‌ ప్రపంచంపై జెండా పాతేస్తుంది. కానీ, మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని బలంగా కోరుకుంటుంది. దీంతో ఈ రెండు పెద్ద టీమ్స్‌ మధ్య భీకర యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. కీలకమైన ఫైనల్‌లో టీమిండియా ఎలాంటి టీమ్‌తో బరిలోకి దిగుతుందో అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

హార్దిక్‌ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సూర్యకుమార్‌ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకుని అతన్నే కొనసాగిస్తున్నాడు. కేవలం ఐదుగురు నిఖార్సయిన బౌలర్లే ఉన్నా.. శార్దుల్‌ ఠాకూర్‌ లాంటి ఆల్‌రౌండర్‌ బెంచ్‌లో ఉన్నా కూడా రోహిత్‌ సూర్య వైపే మొగ్గుచూపుతున్నాడు. పైగా ఐదుగురు బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో పెద్దగా ప్రభావం కూడా పడటం లేదు. పైగా సూర్య ఉంటే.. ఇన్నింగ్స్‌ చివర్లలో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఉపయోగపడతాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బలంగా నమ్ముతుంది. కానీ, ఫైనల్‌లో మాత్రం టీమిండియా ఒక కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.

ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్‌లో స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని సమాచారం. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడి మంచి ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. సో.. అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేసేందుకు అవ్విన్‌ను బరిలోకి దింపుతారేమో చూడాలి. అయితే.. జట్టులో మార్పుల గురించి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ‘ఫైనల్ మ్యాచ్‌ ఆడేందుకు జట్టులోని 15 మందికి అవకాశం ఉంది. పిచ్, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేవి పరిశీలించి తుది జట్టును ఎంపిక చేస్తాం. 12-13 మందితో జట్టును సిద్దం చేశాం. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఖరారు చేయలేదు.’ అని పేర్కొన్నాడు. మరి ఫైనల్‌లో అశ్విన్‌ను ఆడించాలా? అవసరం లేదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి