iDreamPost

వరల్డ్ కప్ ఫైనల్ కి చేరిన భారత్

వరల్డ్ కప్ ఫైనల్ కి చేరిన భారత్

టీ 20 ప్రపంచకప్ లో తొలిసారిగా భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరుకుంది. ఇంగ్లాండ్ తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంది. భారత మహిళల జట్టు ఫైనల్ కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గత ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయినా భారత్ ఫైనల్ కి వెళ్లే అవకాశం కోల్పోయింది. కాగా భారత జట్టుపై ఇంగ్లాండ్ కి మంచి రికార్డు ఉంది. గ్రూప్ దశలో నాలుగు విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉన్న భారత జట్టుకు ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం లభించింది. రిజర్వ్ డే లేకపోవడం వల్ల మ్యాచ్ జరగకుండానే ఫైనల్ కి చేరిన జట్టుగా భారత్ నిలిచింది.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకి ఉండటంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇండియా,దక్షిణాఫ్రికాల మధ్య ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్ లో జరగనుంది. తుదిపోరులో కూడా భారత జట్టు రాణించి టైటిల్ సొంతం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తే తొలిసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా హర్మన్ ప్రీత్ కౌర్ సేన రికార్డు సృష్టిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి