iDreamPost

36 ఏళ్లుగా ఉన్న ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్! ఇది కోహ్లీ దెబ్బ!

  • Published Oct 09, 2023 | 5:56 PMUpdated Oct 09, 2023 | 5:56 PM
  • Published Oct 09, 2023 | 5:56 PMUpdated Oct 09, 2023 | 5:56 PM
36 ఏళ్లుగా ఉన్న ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్! ఇది కోహ్లీ దెబ్బ!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా శుభారంభం చేసింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-రాహుల్‌ అద్భుత పోరాటంతో భారత్‌కు తొలి మ్యాచ్‌లో విజయం దక్కింది. ఆసీస్‌ లాంటి టీమ్‌పై వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో లభించిన ఈ విజయం టీమిండియా మంచి బూస్టప్‌ ఇవ్వనుంది. తొలుత ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లినా.. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఆస్ట్రేలియాను 199 పరుగులకే కట్టడి చేయడంతో టీమిండియా సులువుగా గెలస్తుందని అంతా భావించారు. కానీ, అక్కడుంది ఆస్ట్రేలియా. వాళ్లు అంత తేలిగ్గా మ్యాచ్‌ను వదిలేయరు కదా.. 200 టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే చెమటలు పట్టించారు. ముగ్గురు బ్యాటర్లను పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ పంపారు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ అయ్యారు. స్కోర్‌ బోర్డుపై 2 పరుగులు మాత్రమే ఉన్నాయి కానీ, 3 వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్‌ చేజారిపోయినట్లే అని క్రికెట్‌ అభిమానులు కంగారు పడ్దారు. కానీ, క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడన్న ఒకే ఒక హోప్‌ మిగిలి ఉంది. ఆ నమ్మకమే నిజమైంది. కేఎల్‌ రాహుల్‌తో కలిసి విరాట్‌ కోహ్లీ టీమిండియాకు విజయం అందించాడు. కోహ్లీ 85, రాహుల్‌ 97(నాటౌట్‌) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లతో టీమిండియాను విజయం వైపు నడిపించారు. చివర్లో కోహ్లీ సెంచరీ చేయకుండా అవుటైనా.. పాండ్యాతో కలిసి రాహుల్‌ మిగతా పని పూర్తిచేశాడు. ఈ విజయంతో టీమిండియా మంచి స్టార్ట్‌ అందుకోవడమే కాకుండా.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న రెండు గొప్ప రికార్డులను బద్దులుకొట్టింది. ప్రపంచ క్రికెట్‌ను కొన్ని ఏళ్ల పాటు రారాజుల పాలించిన ఆస్ట్రేలియా కొన్ని గొప్ప గొప్ప రికార్టులను నెలకొల్పింది. వాటిలో.. రెండు రికార్డులు ఆదివారం టీమిండియా బ్రేక్‌ చేసింది. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1999 నుంచి 2019 మధ్య​ జరిగిన వన్డే వరల్డ్‌ కప్పుల్లో ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. 1999, 2003, 2007, 2011, 2015, 2019 వన్డే వరల్డ్‌ కప్స్‌లలో ఆసీస్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ఓడిందే లేదు. చివరి సారిగా 1996 వరల్డ్‌ కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిన ఆసీస్‌.. మళ్లీ ఏ టీమ్‌కు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. ఈ ఆరు వరల్డ్‌ కప్స్‌లో నాలుగు సార్లు ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల ఈ రికార్డును టీమిండియా తాజాగా బద్దలు కొట్టంది. ఇక మరో అద్భుత రికార్డు కూడా బ్రేక్‌ అయింది. వరల్డ్‌ కప్స్‌ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు చెన్నైలోని చెపాక్‌ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడింది. 1987 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియా, జింబాబ్వేతో రెండు మ్యాచ్‌లు ఆడింది. అలాగే 1996 వరల్డ్‌ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్‌ ఆడింది.

ఇప్పుడు ఈ వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియాతో ఆదివారం ఆడింది. అయితే.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ కప్స్‌లో 1987 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు చెపాక్‌లో ఓటమి అనేదే తెలియదు. 36 ఏళ్ల ఈ రికార్డును సైతం టీమిండియా బ్రేక్‌ చేసింది. చెపాక్‌లో ఆసీస్‌ గర్వాన్ని అణిచివేసింది. అయితే.. ఈ విజయంలో విరాట్‌ కోహ్లీకి ఎక్కువగా క్రెడిట్‌ ఇవ్వాలి. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో తన ఎక్స్‌పీరియన్స్‌తో రాహుల్‌ను గైడ్‌ చేసుకుంటూ.. మంచి ఓపికతో సూపర్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించి.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న రెండు భారీ రికార్డులను బ్రేక్‌ చేయడంలో సాయపడ్డాడు. మరి ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంతో పాటు, రెండు గొప్ప రికార్డులు బ్రేక్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓడిపోతాం అనుకున్న మ్యాచ్‌ల్లో.. కోహ్లీ గెలిపించిన బెస్ట్‌ 6 మ్యాచ్‌లు ఇవే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి