iDreamPost

సరిలేరు.. స్థానికులకెవ్వరూ..!!

సరిలేరు.. స్థానికులకెవ్వరూ..!!

అమెరికా నుంచి ఆదిలాబాద్‌ వరకు ఎన్నికల్లో గెలుపొందేందకు ఒకటే తారక మంత్రం.. స్థానికం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయినా.. తెలంగాణలోని కౌన్సిలర్‌ యాదగిరి అయినా ఈ మంత్రాన్నే జపించి విజయం సాధించారు. ‘‘నేను లోకల్‌’’ ఫీలింగ్‌ ఎన్నికల్లో బాగా పని చేస్తుందని తెలంగాణ పురపాలక ఎన్నికల సాక్షిగా మరోమారు రుజువైంది.

తెలంగాణ పరపాలక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తాను చాటారు. జాతీయ పార్టీలైన బీజేపీ, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, ఎంఐఎం లకన్నా ఎక్కువ స్థానాల్లో స్వతంత్రలు గెలిచారు. 120 మున్సిపాలిటీల్లోని 2727 వార్డులకు గాను స్వతంత్రలు ఏకంగా 261 స్థానాల్లో జయకేతనం ఎగుర వేశారు. టీఆర్‌ఎస్‌ 1579 వార్డులు, కాంగ్రెస్‌ 541, బీజేపీ 236, ఎంఐఎం 71, సీపీఐ 20, సీసీఎం 11, తెలుగుదేశం 8 స్థానాలు గెలుచుకున్నాయి.

నగరపాలక సంస్థల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. 49 డివిజన్లలో విజయబావుటా ఎగురవేశారు. 9 నగరపాలక సంస్థల్లోని 325 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధికంగా 152 డివిజన్లలో గెలిచింది. ఆ తర్వాత 66 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 41, ఎంఐఎం 17 డివిజన్లలో గెలిచాయి. నగరాల్లో 49 సీట్లు గెలుచుకున్న స్వతంత్రులు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గెలుపు పట్టికలో 3వ స్థానంలో నిలివడం విశేషం.

ముఖ్యమంత్రి అయినా.. మంత్రి అయినా.. కాలికి బలపం కట్టుకుని తిరిగినా… స్థానిక అభ్యర్థి బలమైనోడైతే తోక ముడవక తప్పదన్న సంకేతాలు తెలంగాణ పురపోరు ద్వారా తేటతెల్లమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి