iDreamPost

Rohit Sharma: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. రోహిత్ కు టీమిండియా దిగ్గజం కీలక సూచనలు!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని కీలక సూచనలు రోహిత్ శర్మకు చేశాడు. రోహిత్ అలా చేస్తేనే ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో పాటుగా దాన్ని కైవసం చేసుకోగలుగుతాడు అంటూ వివరించాడు గవాస్కర్.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని కీలక సూచనలు రోహిత్ శర్మకు చేశాడు. రోహిత్ అలా చేస్తేనే ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో పాటుగా దాన్ని కైవసం చేసుకోగలుగుతాడు అంటూ వివరించాడు గవాస్కర్.

Rohit Sharma: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. రోహిత్ కు టీమిండియా దిగ్గజం కీలక సూచనలు!

సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ నెగ్గి 31 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని చూస్తోంది టీమిండియా. ఇప్పటి వరకు భారత జట్టు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ నెగ్గింది లేదు. గంగూలీ, ధోని లాంటి దిగ్గజాలకు కూడా ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టి.. కొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కొన్ని కీలక సూచనలు రోహిత్ శర్మకు చేశాడు. రోహిత్ అలా చేస్తేనే ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో పాటుగా దాన్ని కైవసం చేసుకోగలుగుతాడు అంటూ వివరించాడు గవాస్కర్.

ప్రస్తుతం అందరి చూపు సౌతాఫ్రికా-ఇండియా టెస్ట్ సిరీస్ పైనే ఉంది. ఈసారి ఎలాగైనా సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది టీమిండియా. అందుకు తగ్గట్లుగానే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని అదే ఊపును టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా చూపించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మకు పలు కీలక సూచనలు చేశాడు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. తొలి టెస్ట్ మంగళవారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు.

రోహిత్ బ్యాటింగ్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..”వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ ఎంతో దూకుడుగా ఆడాడు. అయితే టెస్ట్ ల్లోకి వచ్చేసరికి ఆ దూకుడును తగ్గించుకోవాలి. ఫార్మాట్ కు అనుగుణంగా తన మైండ్ సెట్ ను మార్చుకుని బ్యాటింగ్ చేయాలి. దానికోసం రోహిత్ తన దూకుడును తగ్గించుకోవాలి. వన్డేల్లో పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలిన రోహిత్ భావించి ఉండవచ్చు. కానీ టెస్టుల్లో అలా కాదు.. ఎంత ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడితే, అన్ని ఎక్కువ పరుగులు వస్తాయి. ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకుని ఆడితే బెటర్. టెస్టుల్లో రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. రోహిత్ రోజు మెుత్తం బ్యాటింగ్ చేస్తే.. ఈజీగా 150 పరుగులు చేస్తాడు. దీంతో జట్టు స్కోర్ ఈజీగా 300-350 దాటుతుంది” అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. తొలి టెస్ట్ కు వరుణుడి రూపంలో భారీ అడ్డంకి ఏర్పడింది. సెంచూరియన్ లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా ఇది కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గ్రౌండ్ మెుత్తాన్ని కవర్లతో నింపిఉంచారు. మరి సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మకు ఇచ్చిన సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి