iDreamPost

వీడియో: రిజ్వాన్ గాలి తీసేసిన విరాట్.. ట్రోలింగ్ లో విరాట్ వేరే లెవల్..!

వీడియో: రిజ్వాన్ గాలి తీసేసిన విరాట్.. ట్రోలింగ్ లో విరాట్ వేరే లెవల్..!

అహ్మదాబాద్ వేదికగా భారత్- పాక్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ ని కట్టడి చేస్తోంది. తొలుత బ్యాటింగ్ లో కాస్త పటిష్టంగా కనిపించిన పాక్ జట్టు.. తర్వాత పేక మేడలా కూలిపోతూ ఉంది. మ్యాచ్ ఇంత ఆసక్తికరంగా సాగుతున్న సందర్భంలో.. కోహ్లీ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతని స్టైల్ లో పాక్ బ్యాటర్ రిజ్వాన్ ను ట్రోల్ చేస్తూ అతని గాలి తీసేశాడు. ఈ తరహా ట్రోల్ చూసి ట్రోలింగ్ లో కూడా విరాట్ కింగ్ అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

భారత్- పాక్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. పాక్ జట్టు పసికూనలా మారిపోయింది. 155 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ కు తర్వాత 4 వికెట్లు కోల్పోయేందుకు పెద్దగా సమయం పట్టలేదు. కేవలం 15 పరుగుల్లో 4 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్, సిరాజ్ చెలరేగడంతో పసికూన జట్టులా కనిపించింది. బౌలింగ్ తో సిరాజ్- కుల్దీప్ చెలరేగుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం విరాట్ కోహ్లీ వైరల్ అవుతున్నాడు. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ వాచ్ లో టైమ్ చూస్తూ కనిపించాడు. ఒకసారి కాదు.. చాలాసార్లు చూశాడు.

ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. అసలు విరాట్ చేతికి వాచ్ లేదు. జస్ట్ చేతి బ్యాండ్ వైపు వాచ్ ని చూస్తున్నట్లు చేశాడు. అతను ఒక ఊహాజనిత వాచ్ లో టైమ్ చూశాడు. ఫ్యాన్స్, ఫొటోగ్రాఫర్ల అటెన్షన్ మొత్తం విరాట్ మీదకు డైవర్ట్ అయింది. అసలు విరాట్ ఏం చేస్తున్నాడు అంటూ అంతా ఆలోచించారు. అయితే విరాట్ అక్కడ మహ్మద్ రిజ్వాన్ ను ట్రోల్ చేశాడు. ఇమామ్ ఉల్ హక్ అవుటయ్యాక.. క్రీజులోకి మహ్మద్ రిజ్వాన్ వచ్చాడు. 13వ ఓవర్లో 3వ బంతికి ఇమామ్ ఉల్ హక్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిజ్వాన్ వెంటనే ఆట మొదలు పెట్టకుండా క్రీజులో రెడీ అయ్యేందుకు సమయం వృథా చేశాడు.

ఆ విషయాన్ని విరాట్ తన స్టైల్ లో చెప్పాడు. ఇంకా ఎంత టైమ్ వేస్ట్ చేస్తావు ఇంక మొదలు పెట్టచ్చు కదా? అన్నట్లు విరాట్ కోహ్లీ చేశాడు. ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ప్రేక్షకులు, నెటిజన్స్ కోహ్లీని వైరల్ చేస్తూ పాపం రిజ్వాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బాబర్(50), రిజ్వాన్(49), ఇమామ్ ఉల్ హక్(36) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలింగ్ చూస్తే.. బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు తలో 2 వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. 39 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ జట్టు 182 పరుగులు చేసింది. మరి.. రిజ్వాన్ ను కోహ్లీ ట్రోల్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి