iDreamPost

IND vs ENG: అందుకు భయపడం.. టీమిండియాకు మెక్ కల్లమ్ హెచ్చరికలు!

రెండు టెస్ట్ కు ముందు టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. దానికి మేం భయపడం అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

రెండు టెస్ట్ కు ముందు టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. దానికి మేం భయపడం అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

IND vs ENG: అందుకు భయపడం.. టీమిండియాకు మెక్ కల్లమ్ హెచ్చరికలు!

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో 28 పరుగుల తేడాతో పరాజయం పొందిన టీమిండియా.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కోసం సిద్దమైంది. ఇక ఇప్పటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. కాగా.. భారత జట్టును గాయాలు వెంటాడుతుండటం పెద్ద సమస్యగా మారింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు ఇంగ్లాండ్ కోచ్ మెక్ కల్లమ్. అందుకు భయపడం అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయడమే కాక.. తొలి మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది భారత టీమ్. కాగా.. ఇప్పటికే విశాఖ చేరుకున్న ఇరు జట్లు పిచ్ పై ఫోకస్ పెట్టాయి. అయితే విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, దీంతో దాన్ని అంచనా వేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు ఇంగ్లాండ్ కోచ్ మెక్ కల్లమ్. ఈ క్రమంలోనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Brendon McCullum shocking comments

ఒకవేళ విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే.. మా టీమ్ మెుత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగడానికి ఏ మాత్రం భయపడదని మెక్ కల్లమ్ తెలిపాడు. తొలి టెస్ట్ లో ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ తో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ టీమ్. డెబ్యూ స్పిన్నర్ టామ్ హార్ట్లీ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను దెబ్బకొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో సైతం స్పిన్ తోనే భారత్ కు షాకివ్వాలని చూస్తోంది ప్రత్యర్థి. అయితే విశాఖలో ఇప్పటి వరకు ఆడిన టెస్టుల్లో టీమిండియాకు ఓటమిలేదు. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి రెండో టెస్ట్ కు ముందు మెక్ కల్లమ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి