iDreamPost

Sanju Samson: ఇంత దారుణమా? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు: ఫ్యాన్స్

ఆఫ్గనిస్థాన్ తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ ని అన్యాయం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆఫ్గనిస్థాన్ తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ ని అన్యాయం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sanju Samson: ఇంత దారుణమా? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు: ఫ్యాన్స్

మొహాలీ వేదికగా టీమిండియా- ఆఫ్గనిస్థాన్ తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా మైదానంలో ఉన్న ప్లేయర్స్ గురించి కాకుండా బెంచ్ మీద కూర్చున్న ఒక ఆటగాడి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. టాస్ పడిన దగ్గరి నుంచి అతని పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను మరెవరో కాదు.. సంజూ శాంసన్. ఆఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ కి సంజూ పేరు రాగానే సదరు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టీ20ల్లో మరోసారి సంజూ మెరుపులు చూడబోతున్నాం అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. కానీ, సంజూకి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పలేదు.

ఆఫ్గనిస్థాన్ తో మ్యాచ్ లో సంజూ శాంసన్ రీ ఎంట్రీ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. మైదానంలో సంజూ బ్యాట్ ఝళిపిస్తాడని కలలు కన్నారు. సంజూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెట్స్ లో చాలానే కష్టపడ్డాడు. కానీ, ఇప్పుడు అవన్నీ వృథా పోయాయి. సంజూ శాంసన్ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో సంజూ కేవలం బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సంజూ మ్యాచ్ లో లేడని తెలియగానే ఫ్యాన్స్ అంతా నెట్టింట విరుచుకుపడుతున్నారు. తమ ఆగ్రహాన్ని బాధను పోస్టుల రూపంలో చూపిస్తున్నారు. అంతేకాకుండా బీసీసీఐకి నేరుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకు అసలు సంజూని బెంచ్ కి పరిమితం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నెట్టింట ఇప్పుడు సంజూ శాంసన్ పేరు మారుమోగుతోంది. మరోసారి అదే మోసం.. అళ్లీ అవే పాలిటిక్స్ అంటూ కన్నెర్రజేస్తున్నారు. సంజూ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంజూ కోసం మేము ఎదురుచూసి ఎదురుచూసి విసిగిపోయాం. నీకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే అసలు క్రికెట్ మీద ఆసక్తి పోతోంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ప్రశ్నలు చూస్తే.. అసలు ఎందుకు సంజూని పక్కన పెట్టారు? ఎందుకు సంజూ శాంసన్ ని వికెట్ కీపర్- బ్యాటర్ గా చూస్తున్నారు? బ్యాట్స్ మన్ గా ఎందుకు అంగీకరించడం లేదు. అతను ఓపినింగ్ చేయగలడు, మిడిలార్డర్ లో ఆడగలడు, అతను ఫినిషర్ గా కూడా మంచి పాత్ర పోషించగలడు, కెప్టెన్సీ కూడా చేయగలడు కానీ, ఎందుకు అతడిని పక్కన పెడుతున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా జితేశ్ శర్మాకు ఎందుకు ఛాన్స్ దక్కింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ కంటే జితేశ్ సమర్థుడని మీరు ఎలా భావిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ లో సంజూని బెంచ్ కే పరిమితం చేయడంపై పెద్దఎత్తున ఆగ్రహం, అసహనం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అందరూ బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి సంజూ శాంసన్ బీసీసీఐ పాలిటిక్స్ కి బలైపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా మొదట్లో కాస్త తడబడినట్లుగా కనిపించింది. అఫ్గాన్ బ్యాటర్లు కాస్త ఫామ్ లో కనిపించారు. కానీ, వెంటనే బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడం ప్రారంభించారు. బంతి మీద పట్టు దొరక్కానే వికెట్లతో చెలరేగారు. భారత బౌలర్లు చలరేగడంతో ఆఫ్గనిస్థాన్ బ్యాటర్లు పెవిలియన్ చేరడం మొదలు పెట్టారు. మొత్తం 12 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్గాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 722 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ కు 2 వికెట్లు, శివమ్ ధూబేకి ఒక వికెట్ దక్కింది. మరి.. సంజూ శాంసన్ కి అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి