iDreamPost

ఓటింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం.. విమర్శలకు అడ్డుకట్ట పడుతుందా?

ఓటింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం.. విమర్శలకు అడ్డుకట్ట పడుతుందా?

చెప్పిన మాట ప్రకారం బిగ్ బాస్ ఈసారి అంతా ఉల్టా పుల్టాగానే చేస్తున్నారు. హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అంతా తేడాగానే ఉంది. బిగ్ బాస్ కి ఇదే తొలి సీజన్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు. నిజానికి ఈ సీజన్ లో మరీ ఇంత ఉల్టా పుల్టా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా స్టేజ్ మీదకు వచ్చారు అంటే.. వాళ్లు ఈ సీజన్ కి ఇంటి సభ్యుడు అని. కానీ, ఈసారి మాత్రం కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే.. పవరాస్త్ర అందుకుంటేనే హౌస్ మేట్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సీజన్ లో దాదాపు 22 మంది ఇంట్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. మొదటి రోజు కేవలం 14 మందినే పంపారు. మిగిలిన సభ్యులు కూడా ఇంట్లోకి వస్తారని చెబుతున్నారు. అయితే వాళ్లలో ఎవరైతే పవరాస్త్రను అందుకుంటారో వాళ్లే ఇంట్లో ఉండే అవకాశం ఉంది. హౌస్ డిజైన్, ఫెసిలిటీస్ విషయంలో కూడా కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చారు. అయితే నాగార్జున వెళ్తూ వెళ్తూ ప్రేక్షకులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పి వెళ్లారు. నిజానికి అది ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా తెలియదు అనుకుంట. అదేంటంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఉంటాయి. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారు. ప్రతి ప్రేక్షకుడికి 10 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. హాట్ స్టార్ ద్వారా రోజుకు 10 ఓట్లు వేయచ్చు. నచ్చిన కంటెస్టెంట్ కి కేటాయించిన నంబర్ ద్వారా 10 మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు.

ఈసారి పాత ఓటింగ్ సంప్రదాయానికి స్వస్తి పలికారు. రోజుకు కేవలం 1 ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఒకటే మిస్డ్ కాల్ కూడా. అందుకే మీరు ఆచి తూచి ఓటు వేయాలని కింగ్ నాగార్జున సూచించారు. అయితే బిగ్ బాస్ అంటే కచ్చితంగా బయట కూడా చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుసు. చాలా మంది పీఆర్స్ ద్వారా గేమ్ ఆడతారని చెబుతారు. అలాగే ఓటింగ్ విషయంలో చాలా మంది షార్ట్ కట్స్ వెతుకుతారు అని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటికి తావు లేకుండా చేయాలనే ఇలాంటి 1 ఓటు తీసుకొచ్చారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ విషయంలో బిగ్ బాస్ పై చాలానే విమర్శలు వచ్చేవి. ఈ నిర్ణయం తీసుకవడానికి కారణం కూడా ఆ విమర్శలే అంటూ చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ట్రై చేయాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పే వాళ్లు కూడా లేకపోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి