iDreamPost

ఇమ్రాన్ ఖాన్ మూడో భార్యపై సె*క్స్ రాకెట్ ఆరోపణలు!

  • Author Soma Sekhar Published - 07:25 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 07:25 PM, Fri - 18 August 23
ఇమ్రాన్ ఖాన్ మూడో భార్యపై సె*క్స్ రాకెట్ ఆరోపణలు!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతడు జైల్లో ఉన్నాగానీ అతడి కష్టాలు తగ్గడం లేదు సరికదా.. సమస్యలు ఒకదానిపై మరోటి వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే పాత కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు రోజుకో కొత్త కేసు మెడకు చుట్టుకుంటోంది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై అతడి మూడో భార్య బుష్రా బీబీపై సె*క్స్ రాకెట్ ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు కలిసి సె*క్స్ రాకెట్ నడిపారని పాక్ లోని అనాథ పిల్లల సంక్షేమ కేంద్రం సూపరిడెంట్ గా ఉన్న మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ లోని పంజాబ్ సర్గోధా నగరంలో 1970లో కషానా వెల్ఫేర్ హౌస్ స్థాపించబడింది. ఇక్కడ అనాథ పిల్లలను, పేద బాలికలను ఉంచారని కషానా సంక్షేమ కేంద్రం మాజీ సూపరిడెంట్ అఫాషా లతీఫ్ తెలిపింది. ఈ సంక్షేమ ఆశ్రమం కేంద్రంగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన మూడో భార్య బుష్రా బీబీ సెక్స్ రాకెట్ ను నడిపారని ఆమె పేర్కొన్నారు. ఆ బాలికలను జంతువుల కంటే హీనంగా చూసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆ బాలికల ప్రయివేట్ పార్ట్స్ లకు గాయాలు అయితే.. శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చిందని లతీఫ్ పేర్కొంది.

ఈ విషయాలను బయటకి చెప్పితే చంపేస్తామని వారిని బెదిరించారని, ఇక వారు వదిలేసిన అమ్మాయిలు ఇప్పటికీ కనిపించకుండా పోయారని అఫాషా లతీప్ పేర్కొన్నట్లు పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. వీటితో పాటుగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చాలా మంది బాలికలు హత్యకు గురైయ్యారని ఆమె ఆరోపించింది. గుర్తింపు వివరాలు ఇవ్వకుండా అక్కడ అనాథలు, పేద బాలికలపై కిరాతక చర్యలు జరుగుతున్నాయని లతీఫ్ పేర్కొంది. సెక్స్ రాకెట్ లో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు కూడా భాగస్వాములుగా ఉండి.. వ్యాపారంలో పాలు పంచుకునేవారని, ఈ మెుత్తం విషయాన్ని బయటపెడుతూ లతీఫ్ ఓ లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖ వైరల్ గా మారింది.

ఇదికూడా చదవండి: గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. వైరల్ గా మారిన వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి