iDreamPost

వీడియో: నమాజ్‌ చేస్తూ ప్రాణాలు విడిచిన మసీదు ఇమామ్!

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో సంభవించే మరణాల సంఖ్య పెరిగిపోయింది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి.. మరుక్షణం గుండెపోటుతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో సంభవించే మరణాల సంఖ్య పెరిగిపోయింది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి.. మరుక్షణం గుండెపోటుతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

వీడియో: నమాజ్‌ చేస్తూ ప్రాణాలు విడిచిన మసీదు ఇమామ్!

ఇటీవల కాలంలో గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక వయస్సుతో సంబంధం లేకుండా పదేళ్ల పాప నుంచి పండు ముసలి వారి వరకు.. అందరూ దీనికి గురవుతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి.. మరుక్షణం గుండెపోటుతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ముఖ్యంగా యువత గుండె పోటు కారణంగా చనిపోతుండటం అందరిలో ఆందోళన కలిస్తుంది. ఇక ఈ హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయే వారి వీడియోలు చూస్తే.. చాలా ఆశ్చర్యాన్ని, కన్నీరు పెట్టేలా కనిపిస్తాయి. తాజాగా నమాజ్ చేస్తూ మస్టిజ్ ఇమామ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండోనేషియా మసీద్ లో  ఓ విషాద ఘటన జరిగింది. ఫజర్ నమాజు చేయిస్తున్న మసీద్ ఇమామ్ సజ్దాలోకి వెళ్లి తిరిగి లేవలేదు. అంతేకాక నమాజ్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గమనించిన వెనుక వరుసలో ఉన్నవారు ఆందోళన చెందలేదు. ఈ ఘటనను గమనించి.. నమాజ్ కి అవాంతరం లేకుండా వెనుక నిల్చున్న మరో వ్యక్తి ముందుకొచ్చి నమాజు చేయించారు. అలా విషాద ఘటన జరిగిన తమ ప్రార్థనను మాత్రం వారు ఆపలేదు. ఈ ఘటన ముస్లింలు నమాజును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారని రుజువు చేస్తుంది.

ఇలా నమాజును మాత్రం ఎప్పుడు అర్థాంతరంగా ముగించలేదు. ఇస్లామ్ హిస్టరీలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. గతంలో ఖలీఫా హజ్రత్ ఉమర్  చేయిస్తుండగా ఆయనపై ఖడ్గంతో దాడి చేశారు. ఆయన నమాజ్ చేస్తున్న స్థితిలోనే కుప్పుకూలిపోయారు.  అయితే వెనుక వరుసలో మిగిలిన ముస్లింలు భయభ్రాంతులకు గురవ్వలేదు. ఉమర్ వెనుక నిల్చుని ఉన్న అబ్ధు రహ్మాన్ బిన్ ఔప్ ముందుకొచ్చి మిగతా నమాజును పూర్తి చేశారు. అనంతరం మాత్రమే జరిగిన దాడి గురించి ఆరా తీశారు.

తాజాగా అదే తరహాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనలో కూడా గుండె పోటుతో ఇమామ్ మరణించిన ఎవరు నమాజ్ ఆపలేదు. మరో వ్యక్తి ముందుకు వచ్చి ముందు ఆ ప్రార్థనలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ గుండెపోటు కారణంగా మరణించారు. అలానే క్రీడలు ఆడుతూ ఎంతో మంది యువత కూడా అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ కి గురై ప్రాణాలు విడిచారు. ఇక  విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో మరణించిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. పాఠాలు చెబుతూనే కుప్పకూలిపోయిన వీడియోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా అదే తరహాలో ఈ ఘటన కూడా చోటుచేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి