iDreamPost

సంచలన నిర్ణయం! యువ క్రికెటర్‌పై ఏడాది పాటు నిషేధం!

  • Published Feb 20, 2024 | 4:58 PMUpdated Feb 20, 2024 | 4:58 PM

ఫ్రాంచైజ్ క్రికెట్‌కి ఆటగాళ్లు బాగా అలవాటు పడిపోతున్నారు. టీమిండియా ఆటగాళ్లు మినహానిస్తే.. ప్రపంచంలోని అన్ని దేశాల ఆటగాళ్లు ప్రపంచంలోని అన్ని లీగ్స్‌లో ఆడుతున్నారు. అయితే.. ఆయా ఫ్రాంచైజ్‌లు కూడా ఆటగాళ్లకు షాకులిస్తున్నాయి. తాజాగా ఓ ఆటగాడు నిషేధానికి గురయ్యాడు.

ఫ్రాంచైజ్ క్రికెట్‌కి ఆటగాళ్లు బాగా అలవాటు పడిపోతున్నారు. టీమిండియా ఆటగాళ్లు మినహానిస్తే.. ప్రపంచంలోని అన్ని దేశాల ఆటగాళ్లు ప్రపంచంలోని అన్ని లీగ్స్‌లో ఆడుతున్నారు. అయితే.. ఆయా ఫ్రాంచైజ్‌లు కూడా ఆటగాళ్లకు షాకులిస్తున్నాయి. తాజాగా ఓ ఆటగాడు నిషేధానికి గురయ్యాడు.

  • Published Feb 20, 2024 | 4:58 PMUpdated Feb 20, 2024 | 4:58 PM
సంచలన నిర్ణయం! యువ క్రికెటర్‌పై ఏడాది పాటు నిషేధం!

భారత క్రికెటర్లు తప్పా.. ప్రపంచంలోని ప్రతి దేశపు ఆటగాళ్లు వారి వారి దేశాల తరుఫున అలాగే కాసులు కురిపించే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ తరఫున కూడా ఆడుతున్నాడు. కరేబియన్‌ క్రికెటర్లు అయితే.. వెస్టిండీస్‌ తరఫున కంటే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ మధ్య ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే.. ఆ దేశ యువ క్రికెటర్‌ నూర్‌ అహ్మద్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. నిషేధం విధించింది ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కాదులేండి.. దుబాయ్‌ వేదికగా జరిగే ఐఎల్‌టీ20(ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20) నిర్వహకులు. ఇంతకీ నూర్‌ అహ్మద్‌ లాంటి యంగ్‌స్టర్‌పై ఏడాది పాటు ఎందుకు నిషేధం విధించారో ఇప్పుడు చూద్దాం..

నూర్‌ అహ్మద్‌ ఐఎల్‌టీ20లో షార్జా వారియర్స్‌ తరఫున ఆడేందుకు 2023 సీజన్‌ కోసం కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. 2023 ఫిబ్రవరీ-మార్చ్‌లో జరిగిన ఐఎల్‌టీ20 సీజన్‌లో నూర్‌.. ఆ జట్టు తరఫున ఆడాడు. అయితే.. సేమ్‌ కండీషన్స్‌పై మరో ఏడాది కాంట్రాక్ట్‌ను పొడిగించుకునేందుకు షార్జా వారియర్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నూర్‌ అహ్మద్‌కు ప్లేయర్‌ అగ్రిమెంట్‌ కాగితాలు పంపించింది. కానీ, నూర్‌ అ‍హ్మద్‌ తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకునేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై షార్జా వారియర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఐఎల్‌టీ20 నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది.

నూర్‌ అహ్మద్‌-షార్జా వారియర్స్‌ మధ్య తలెత్తిన వివాదంపై ఐఎల్‌టీ20 నుంచి ముగ్గురు వ్యక్తులు విచారణ జరిపారు. వారిలో ఐఎల్‌టీ20 సీఈఓతో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు. విచారణ అనంతరం వారు నూర్‌ అహ్మద్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. నిజానికి నూర్‌పై 20 నెలల పాటు నిషేధం విధించాలని వారు నిర్ణయించినప్పటికీ.. షార్జా వారియర్స్‌తో కాంట్రాక్ట్‌ చేసుకునే సమయంలో నూర్ అహ్మద్‌ మైనర్‌ కాబట్టి.. అతని వయస్సును పరిగణంలోని తీసుకుని.. 20 నెలల నిషేధాన్ని 12 నెలలకు తగ్గించారు. దీంతో.. వచ్చే ఏడాది వరకు నూర్‌పై ఈ నిషేధం కొనసాగనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి