iDreamPost

ఇవి అక్రమ అరెస్టులైతే…మీ పాలనలో జరిగినవేంటీ చంద్రబాబూ..?

ఇవి అక్రమ అరెస్టులైతే…మీ పాలనలో జరిగినవేంటీ చంద్రబాబూ..?

అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు చేసిన తమ నేతలను పార్టీ నేతలను వెనకేసుకురావడంలో టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు‌ దేశంలో మరెవ్వరూ సాటిరారు. ఎంత అవినీతి చేసినా…ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు. ప్రజలను ఎలా దోచుకున్నా ఫర్వాలేదు. కాని పార్టీతోనే ఉండాలి. అవినీతి అక్రమాలు చేసైనా పార్టీని నిలబెట్టాలి అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తాడు.

ఈ క్రమంలోనే ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడును పక్కా ఆధారాలతో ఎసిబి అరెస్టు చేసింది. తప్పు చేసిన వాడిని అరెస్టు చేయడం, విచారించడం అది చట్టబద్ధంగానే జరిగే ప్రక్రియ. ఇదే ఏపిలో జరిగింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి.

అయితే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం అన్యాయమంటా..చంద్రబాబుగారు అంటున్నారు. ఇది అన్యాయమైతే చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్షాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను అరెస్టు చేయడాన్ని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి.

రాష్ట్రంలో టిడిపి నేతలు గత ఐదేళ్లలో దొరికింది దొరికినట్లు తిన్నారు. ప్రజల సొమ్మును దోచుకిన్నారు. అందుకు అనుగుణంగా వారికి నచ్చినట్లు ఉత్తర్వులు ఇచ్చుకున్నారు. ఆనాడు తిన్నదల్లా కక్కించే ప్రక్రియ ప్రారంభం అయ్యేసరికి చంద్రబాబుకు భయం పట్టుకుంది. దీంతో ఏవేవో ప్రకటనలు‌ చేస్తున్నారు. తనకు‌ సూటుకాని మాటలు ఆడుతున్నారు.

రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రజల మన్ననలతో అధికారాన్ని చేపట్టిన సిఎం వైఎస్ జగన్ గత పాలన అవినీతి బూజును దుపుతున్నారు. అలాగే మరోవైపు ప్రస్తుత ప్రభుత్ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంలో గత పాలనలో కార్మిక మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను ఎసిబి అరెస్టు చేసింది. వీటిని అక్రమ అరెస్టులంటూ చంద్రబాబు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. ఇవి అక్రమ అరెస్టులైతే చంద్రబాబు గత

ఐదేళ్ల పాలనలో జరిగిన అరెస్టులు ఏంటీ..?

ఆనాడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులను, యువకులను అక్రమంగా అరెస్టు చేయించింది ఎవరు..? ఆనాడు ఆ అమాయక విద్యార్థులపైన, యువకులపైన అక్రమ కేసులు పెట్చిందెవరూ..? ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్యపైనైనా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసినా అమాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం‌ జరిగేవి. కొన్ని సందర్భాలలో అయితే ఏకంగా జైలుకు పంపించారు.

ఆనాడు అమాయకులను అరెస్టులు చేయించడం, కేసులు బనాయించడం, జైల్ కు పంపించడం చేసిన చంద్రబాబే…ఈ రోజు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే దాన్ని అక్రమ అరెస్టులని ప్రకటనలు చేయడం ఎలాగుందంటే…దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి