iDreamPost

పెళ్లి కాకుండానే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

  • Published Aug 06, 2023 | 11:34 AMUpdated Aug 06, 2023 | 11:34 AM
  • Published Aug 06, 2023 | 11:34 AMUpdated Aug 06, 2023 | 11:34 AM
పెళ్లి కాకుండానే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

స్టార్‌ హీరోయిన్‌ ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలియానాకు ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఆమె సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన ఇలియానా.. ఆగస్టు 1న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శనివారం తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించింది. తన కొడుకు ఫోటోను షేర్ చేస్తూ.. పేరును రివీల్ చేసేసింది.

‘‘మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ను పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మటల్లో చెప్పలేము.” అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాను తల్లిని కాబోతున్నట్లు గతంలో ఇన్ స్టా వేదికగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లోనే ఉంది. అయితే అప్పటికీ ఇలియానాకు పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నట్లు ప్రకటించడంతో నెటిజన్స్ షాకయ్యారు.

ఆ తర్వాత చాలా రోజులు తనకు కాబోయే భర్త గురించి చెప్పకుండా దాచిన ఇలియానా.. కొద్దిరోజుల క్రితం అతడిని అభిమానులకు పరిచయం చేసింది. కాగా ఇలియానా బిడ్డకు జన్మనివ్వడంతో నర్గీస్ ఫక్రీ, కరణ్‌వీర్ శర్మ, అతియా శెట్టి, సోఫీ చౌదరి, హుమా ఖురేషీతో సహా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ గోవా బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ బ్యూటీ చివరిసారిగా 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ లో కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి