iDreamPost

ఎక్కాల్సిన ట్రైన్‌ మిస్‌ అయితే.. అదే టిక్కెట్‌పై మరో రైలులో జర్నీ చేయవచ్చా?

  • Published Mar 06, 2024 | 4:21 PMUpdated Mar 06, 2024 | 4:21 PM

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసేటప్పుడు అనుకొని కారణాల వల్ల మనం ఎక్కాల్సిన ట్రైన్ ను ఏదో రకంగా మిస్ అవుతుంటాం. మరి, అలా ట్రైన్ మిస్ అయిన వారు మరొక ట్రైన్ ఎక్కవచ్చా లేదనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసేటప్పుడు అనుకొని కారణాల వల్ల మనం ఎక్కాల్సిన ట్రైన్ ను ఏదో రకంగా మిస్ అవుతుంటాం. మరి, అలా ట్రైన్ మిస్ అయిన వారు మరొక ట్రైన్ ఎక్కవచ్చా లేదనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

  • Published Mar 06, 2024 | 4:21 PMUpdated Mar 06, 2024 | 4:21 PM
ఎక్కాల్సిన ట్రైన్‌ మిస్‌ అయితే.. అదే టిక్కెట్‌పై మరో రైలులో జర్నీ చేయవచ్చా?

చాలామంది ప్రయాణికులు ఎక్కడికైనా ప్రయాణించలంటే ఎక్కువగా ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. ఎందుకంటే.. బస్సులకన్నా, ఈ రైళ్లలో ప్రయాణిస్తే కొంచెం ప్రశాంతంగా ఉండటంతో పాటు వేగంగా చేరవలసిన గమ్య స్థానానికి చేరుతారు. అందువలన ఎక్కువ శాతం అందరూ ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. మరి అలా రైళ్లలో ప్రయాణించాలని అనుకునే వారు తాము ఎక్కావల్సిన ట్రైన్ కోసం ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకుంటే పర్వాలేదు. కానీ, ఏమాత్రం ట్రైన్ మిస్ అయితే ఇక ఏం చేయలేక దీనంగా ఉండిపోతారు. ఎందుకంటే తాము ఎక్కాల్సిన ట్రైన్ టికెట్ కు చెల్లించిన డబ్బులు వెనక్కిరావు. పైగా ఆ టికెట్ మరి ఏ ట్రైన్ కు వినియోగించేందుకు పనికిరాదు. మరి, అలా కన్ఫర్మ్ అయిన టికెట్ కలిగివుండి, రైలును మిస్ అయితే , తిరిగి అదే టిక్కెట్ పై మరొక రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే సందేహం చాలమందిలో ఉంటుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

మనలో చాలామంది రైలు ప్రయాణం చేయాడానికి ఇష్టపడి టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఎక్కాల్సిన ట్రైన్ ఏదో రకంగా మిస్ అవతుంటాం. మరి అలా ట్రైన్ మిస్ అయిన తర్వాత.. ఎంతోమందిలో వచ్చే సందేహం మనం ఇప్పడున్న టికెట్ తో మరొక రైలు ఎక్కవచ్చా ? లేదంటే మళ్లీ కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందేనా అని ఆలోచిస్తారు. అలాంటి సమయంలో ట్రైన్ మిస్ అయిన వాళ్లు అదే టిక్కెట్ తో తదుపరి రైలులో ప్రయాణించగలరా.. అనేది మన వద్ద ఉన్న టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఇది భారతీయ రైల్వే టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణ తరగతికి చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక రైలు టిక్కెట్టును మరో రైలు ఎక్కేందుకు ఉపయోగించలేరు.

అయితే ‘తత్కాల్’ టిక్కెట్లు, ‘ప్రీమియం తత్కాల్’ టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులకు మాత్రం అదే రోజు కొన్ని షరతులకు లోబడి మరొక రైలులో ఎక్కేందుకు అనుమతిస్తారు.అలాగే మీ వద్ద జనరల్ టిక్కెట్ ఉంటే మొదటి రైలు తప్పిపోయిన తర్వాత.. అదే టిక్కెట్‌తో తదుపరి ప్యాసింజర్ రైలులో ప్రయాణించవచ్చు. ఇక మీరు సాధారణంగా టిక్కెట్‌ను రిజర్వ్ చేసి ఉండి వెంటనే టికెట్ తీసుకోకపోయిన, అలాగే వెంటనే ప్రీమియం తీసుకోకుండా మరొక రైలులో ఎక్కితే.. టికెట్ లేని ప్రయాణీకుడిగా పరిగణించబడతారు. దీంతో TTE మిమ్మల్ని పట్టుకుంటే తప్పని సరిగా జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కనుక ఒకవేళ మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీరు మరొక రిజర్వు టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి.

అలాగే ఏ కారణం చేతనైనా మీరు ట్రైన్ మిస్ అయితే టికెట్ డబ్బులను వాపసు పొందండి. అందుకోసం erail.inలో అందించిన సమాచారం ప్రకారం, మీరు ప్రయాణించే రైలు మీ నుంచి మినహాయింపు పొందినట్లయితే ఆ సందర్భంలో మీరు రైలు టికెట్ వాపసు పొందవచ్చు. వాపసు పొందడానికి టిక్కెట్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు TDR నింపాలి. ఇక స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన గంటలోపు మీరు TDRని ఫైల్ చేయవచ్చు. రైల్వే నియమాల ప్రకారం మీకు వాపసు ఇవ్వబడుతుంది. దీంతోపాటు మీరు ప్రయాణించకపోవడానికి గల కారణాలను కూడా అందించాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చార్ట్ తయారు చేసిన తర్వాత మీరు టిక్కెట్‌ను రద్దు చేస్తే మీకు డబ్బులు వాపసు అనేది జరగదు. మరి, ఒక ట్రైన్ టికెట్ ను వేరొక ట్రైన్ కి ఎలా వినియోగించుకోవాలనే ఈ సమాచారం పై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి