iDreamPost

గృహ జ్యోతి పథకానికి నేటి నుంచే లబ్థిదారుల గుర్తింపు!.. ఆ కార్డే ప్రామాణికం!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ పథకానికి అర్హులను నేటి నుంచే గుర్తించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ పథకానికి అర్హులను నేటి నుంచే గుర్తించనున్నట్లు తెలుస్తోంది.

గృహ జ్యోతి పథకానికి నేటి నుంచే లబ్థిదారుల గుర్తింపు!.. ఆ కార్డే ప్రామాణికం!

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు హామీలను నెరవేర్చేందుకు రెడీ అవుతోంది. రూ. 500కే గ్యాస్, గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచే ఈ పథకానికి లబ్థిదారులను గుర్తించనున్నట్లు సమాచారం. అయితే ఈ పథకానికి రేషన్ కార్టు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ కేబినెట్ ఉచిత విద్యుత్ పథకానికి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనుంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత అధికారులు అర్హుల వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది విద్యుత్ వినియోగదారుల ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్‌ రీడింగ్‌ తీసి యజమానుల నుంచి రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు నంబర్లతో పాటు మొబైల్‌ నంబర్‌లను తీసుకోనున్నారు. కాగా గృహ జ్యోతి పథకానికి సబంధించిన లబ్ధిదారుల గుర్తింపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈపథకానికి అర్హత సాధించాలంటే రేషన్ కార్టు ప్రామాణికం కానుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చాలా మందికి రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా ఆప్రక్రియ ప్రారంభం కాలేదు.

Identification of beneficiaries of free electricity!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి