iDreamPost

టీమిండియాకు అచ్చొచ్చిన మెహర్ రమేష్ సెంటిమెంట్​.. ఈసారీ కప్పు మనదే!

  • Author singhj Published - 06:10 PM, Sat - 18 November 23

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్​ సెంటిమెంట్ టీమిండియాకు అచ్చొచ్చిందని క్రికెట్ లవర్స్ అంటున్నారు. ఈసారి కూడా మెహర్ సెంటిమెంట్ రిపీటైతే కప్పు మనదేనని ధీమాగా చెబుతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్​ సెంటిమెంట్ టీమిండియాకు అచ్చొచ్చిందని క్రికెట్ లవర్స్ అంటున్నారు. ఈసారి కూడా మెహర్ సెంటిమెంట్ రిపీటైతే కప్పు మనదేనని ధీమాగా చెబుతున్నారు.

  • Author singhj Published - 06:10 PM, Sat - 18 November 23
టీమిండియాకు అచ్చొచ్చిన మెహర్ రమేష్ సెంటిమెంట్​.. ఈసారీ కప్పు మనదే!

ఆరు వారాలుగా హోరాహోరీ మ్యాచులు, సీడ్ ఎడ్జ్ థ్రిల్లర్స్, ఎన్నో గూస్​బమ్స్ మూమెంట్స్ ఇచ్చిన వన్డే వరల్డ్ కప్-2023 తుది అంకానికి చేరుకుంది. మొదటి సెమీఫైనల్​లో న్యూజిలాండ్​ను చిత్తు చేసిన రోహిత్ సేన, రెండో సెమీస్​లో సౌతాఫ్రికాను ఓడించిన కమిన్స్ సేన ఆదివారం నాడు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్​కు అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటిదాకా ఆడిన పదికి 10 మ్యాచుల్లోనూ నెగ్గిన టీమిండియా చివరి మెట్టుపై కూడా డామినేషన్ చలాయించాలని చూస్తోంది. మెగా టోర్నీలో ఆడిన పది మ్యాచుల్లో ఎనిమిదింట్లో గెలిచిన కంగారూ జట్టు ఎలాగైనా భారత్​కు షాక్ ఇచ్చి కప్పు కొట్టేయాలని చూస్తోంది.

రికార్డులు ఆస్ట్రేలియాకు ఫేవర్​గా ఉంటే.. ఫామ్, స్వదేశంలో ఆడుతుండటం భారత్​కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. వరల్డ్ కప్స్​లో బెస్ట్ రికార్డు ఉన్న ఆస్ట్రేలియా టీమ్​కు ఎన్నో ఫైనల్స్​ ఆడిన ఎక్స్​పీరియెన్స్ ఉంది. ఈ దశలో ఉండే ప్రెజర్​ను ఎలా డీలా చేయాలి? బెస్ట్​ పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలో ఆసీస్ క్రికెటర్లకు బాగా తెలుసు. భారత్​లా అన్ని విభాగాల్లో అద్భుతంగా లేకపోయినా ఉన్న వనరులను చక్కగా వినియోగించుకుంటూ ఫైనల్​కు దూసుకొచ్చింది కంగారూ టీమ్. అయితే టీమిండియాను కూడా ఈ విషయంలో తీసిపారేయడానికి లేదు. ఐసీసీ టోర్నీల్లో ఇటీవల కాలంలో తడబడుతున్న భారత్​ ఆ రికార్డును మార్చాలని భావిస్తోంది. టీమ్​ నిండా స్టార్లు ఉండటం, అందరూ సూపర్ ఫామ్​లో ఉండటం, ప్రెజర్​ను డీల్ చేసే సత్తా ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్​గా ముందుండి నడిపిస్తుండటంతో ఈసారి కప్పు తమదేనని ధీమాలో ఉంది టీమిండియా.

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ అందుకోవడానికి భారత్ ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు. ఈ తరుణంలో పాత సెంటిమెంట్స్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ చర్చిస్తున్నారు. గతంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన టైమ్​లో ఏమేం జరిగాయి? భారత్​కు ఏది అనుకూలంగా మారింది? అనే విషయాలను ఇంటర్నెట్​లో సెర్చ్ చేస్తున్నారు. ఇలా సెర్చ్ చేసిన అంశాలను ఒకచోట చేర్చి మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ మీమ్స్ కాస్తా వైరల్ అవుతున్నాయి. అలా వైరల్ అవుతున్న మీమ్స్​లో ఒకటి ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్​కు సంబంధించినది కావడం గమనార్హం. ఆయన డైరెక్షన్​లో వచ్చిన గత సినిమాలకు ఐసీసీ ట్రోఫీలకు లింక్ ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

మెహర్ రమేష్ తీసిన రెండు సినిమాలకు ఐసీసీ ట్రోఫీలతో కనెక్షన్ ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తీసిన ‘శక్తి’ మూవీ 2011లో రిలీజైంది. ఈ చిత్రం మెహర్​కు షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ‘శక్తి’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే అదే ఏడాది ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్​ను గెలుచుకుంది. విక్టరీ వెంకటేష్​తో మెహర్ తీసిన ‘షాడో’ ఫిల్మ్ 2013లో విడుదలైంది. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. అయితే ఆ సంవత్సరం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఇక, ఈ ఏడాది వరల్డ్ కప్​కు ముందు మెహర్-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ‘భోళా శంకర్ రిలీజై డివైడ్ టాక్​ను తెచ్చుకుంది. చిరు కెరీర్​లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఇదొకటి ట్రేడ్ టాక్. ఈ నేపథ్యంలో ఈసారి కప్పు మనదేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మెహర్ మూవీ రిలీజైందంటే.. ఆ ఏడాది ఐసీసీ ట్రోఫీ మనదేనని చెబుతున్నారు. మరి.. మెహర్ రమేష్ సెంటిమెంట్ ఈసారి భారత్​కు కలసిసొస్తుందని మీరు భావిస్తున్నయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫైనల్ కోసం ద్రవిడ్-రోహిత్ మాస్టర్ ప్లాన్.. ఆ అస్త్రాన్ని మళ్లీ బయటకు తీస్తున్న భారత్!

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి