iDreamPost

Sikandar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై ICC బ్యాన్! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 02:24 PM, Tue - 12 December 23

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బ్యాన్ విధించింది. మరి బ్యాన్ విధించడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బ్యాన్ విధించింది. మరి బ్యాన్ విధించడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 02:24 PM, Tue - 12 December 23
Sikandar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై ICC బ్యాన్! కారణం ఏంటంటే?

సికిందర్ రజా.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అద్భుతమైన ఆటతీరుతో ఆల్ రౌండర్ గా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇటు కెప్టెన్ గా, అటు ప్లేయర్ గా రాణించాడు రజా. మూడు మ్యాచ్ ల సిరీస్ ని ఐర్లాండ్ 2-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జింబాబ్వేకు అద్భుత విజయాన్ని అందించాడు సికిందర్ రజా. ఇక ఈ మ్యాచ్ అనంతరం అతడిపై నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. మరి సికిందర్ రజాపై ఐసీసీ బ్యాన్ విధించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ క్రికెట్ ను మానిటరింగ్ చేస్తుంటుందనే విషయం మనందరికి తెలిసిందే. క్రికెట్ లోకి కొత్త కొత్త రూల్స్ ను తీసుకురావడమే కాకుండా.. ఆటగాళ్లు మితిమీరి ప్రవర్తిస్తే.. వారిపై కొరడా ఝుళిపించడం మనం ఎన్నోసార్లు చూశాం. ఇటీవలే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై కూడా కొరఢా ఝుళిపించి రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో సికిందర్ రజా అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఆటగాళ్లు అయిన కాంఫర్, జోష్ లిటిల్ లతో అనుచితంగా ప్రవర్తించాడు.

sikender raja baned

ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతుండగా.. జోష్ లిటిల్ లతో పాటుగా కాంఫర్ తో గొడవకు దిగాడు సికిందర్ రజా. దీంతో ఐసీసీ నిబంధన 1 ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా అతడిపై రెండు మ్యాచ్ నిషేధం విధించింది ఐసీసీ. అలాగే రజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను కూడా విధించారు. దీంతో ఐర్లాండ్ తో జరిగిన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో రజా ఆడలేదు. దీంతో రెండు మ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ ఓడి సిరీస్ ను చేజార్చుకుంది. సికిందర్ రజాతో పాటుగా జోష్ లిటిల్, కాంఫర్ లకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు ఐసీసీ అధికారులు. మరి జింబాబ్వే కెప్టెన్ పై బ్యాన్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి