iDreamPost

ICC: బ్యాటర్లకు పండగే.. క్రికెట్ లోకి కొత్త రూల్!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త సంవత్సరం ఓ కొత్త రూల్ ను క్రికెట్ లోకి తీసుకొచ్చింది. ఈ నయా రూల్ బ్యాటర్లకు పండగే అని చెప్పొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త సంవత్సరం ఓ కొత్త రూల్ ను క్రికెట్ లోకి తీసుకొచ్చింది. ఈ నయా రూల్ బ్యాటర్లకు పండగే అని చెప్పొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

ICC: బ్యాటర్లకు పండగే.. క్రికెట్ లోకి కొత్త రూల్!

ప్రపంచ క్రికెట్ ను మానిటరింగ్ చేసే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మారుస్తూ.. కొత్త కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పటికే పలు నిబంధనలను సడలించడమే కాకుండా.. నయా రూల్స్ ను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ కొత్త రూల్ ను ప్రపంచ క్రికెట్ లోకి తీసుకొచ్చింది ఐసీసీ. న్యూ ఇయర్ వేళ.. ఇది బ్యాటర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే? ఐసీసీ తీసుకొచ్చిన ఈ రూల్ బ్యాటర్లకు సానుకూలంగా మారనుంది. దీంతో వారు పండగ చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఐసీసీ తీసుకొచ్చిన ఆ సరికొత్త రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త సంవత్సరం ఓ కొత్త రూల్ ను క్రికెట్ లోకి తీసుకొచ్చింది. స్టంపౌట్ విషయంలో ఐసీసీ పాత నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇంతకు ముందు స్టంపింగ్ విషయంలో వికెట్ కీపర్ అప్పీల్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు పై అంపైర్ కు అంటే థర్డ్ అంపైర్ కు రిఫర్ చేసేవారు. దీంతో సదరు థర్డ్ అంపైర్ రిప్లేలో ఫస్ట్ క్యాచ్ అంటే ఆల్ ట్రా ఎడ్జ్ చేసి.. తర్వాత స్టంప్ ఔటా? కాదా? అన్న విషయాన్ని వెల్లడించేవారు.

new rule in cricket

అయితే ఐసీసీ తాజాగా తెచ్చిన న్యూ రూల్ ప్రకారం ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లో అది కనిపించదు. ఐసీసీ న్యూ రూల్ ప్రకారం.. ఫీల్డ్ అంపైర్ స్టంపౌట్ కు రిఫర్ చేస్తే.. ఇక నుంచి థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్ ను మాత్రమే చెక్ చేయాలి. బ్యాట్ కు బంతి తాకిందా? లేదా? అన్న విషయాన్ని చూడడు. ఆటగాళ్లు ఎక్కువ శాతం ఈ రూల్ ను ఉపయోగించుకుంటున్నారని ఐసీసీ ఈ మార్పు తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మరి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి