iDreamPost

సెమీస్ ముందు టీమిండియాకి బ్యాడ్ సెంటిమెంట్! అచ్చం 2019 సీన్ రిపీట్?

  • Author Soma Sekhar Updated - 04:24 PM, Tue - 14 November 23

వరల్డ్ కప్ లో భాగంగా తొలి సెమీఫైనల్లో తలపడటానికి టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్దమైయ్యాయి. అయితే సెమీస్ లో భారత్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో భాగంగా తొలి సెమీఫైనల్లో తలపడటానికి టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్దమైయ్యాయి. అయితే సెమీస్ లో భారత్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. మరి ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 04:24 PM, Tue - 14 November 23
సెమీస్ ముందు టీమిండియాకి బ్యాడ్ సెంటిమెంట్! అచ్చం 2019 సీన్ రిపీట్?

ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ మెగాటోర్నీలో సెమీఫైనల్స్ కు సమయం ఆసన్నమైంది. ఫైనల్ కు ముందు జరగనున్న తొలి పోరులో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు నవంబర్ 15న ముంబై వేదికగా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక రెండో మ్యాచ్ లో ఆసీస్-సౌతాఫ్రికా టీమ్స్ ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ కోసం పోటీపడనున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. దీంతో సెమీస్ కు ముందు టీమిండియాకు బ్యాడ్ సెంటిమెంట్ ఎదురుకాబోతుందా? అచ్చం 2019 సీన్ రిపీట్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తపరుస్తున్నారు. మరి సెమీస్ లో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

టీమిండియా.. ఈ ప్రపంచ కప్ లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. ఒక్క ఓటమి లేకుండా టోర్నీలో దుమ్మురేపి.. టైటిల్ కు చేరువైంది. ఇక సెమీఫైనల్లో భాగంగా పటిష్టమైన న్యూజిలాండ్ తో అమీతుమీకి రెడీ అయ్యింది. నవంబర్ 15న ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఈ పోరు జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్ కు సంబంధించి అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. భారత్-న్యూజిలాండ్ పోరుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. ఇక థర్డ్ అంపైర్ గా జోయెల్ విల్సన్ ఫోర్త్ అంపైర్ గా అడ్రియన్ హోల్డ్ స్టాక్. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాప్ట్ నియమించబడ్డారు.

అయితే ఇక్కడి వరకు భాగానే ఉన్నా.. అసలు ఆందోళనంతా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. 2019 బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అంటూ టీమిండియా ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి అంటే? 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడ్డ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు కూడా ఫీల్డ్ అంపైర్ గా వ్యవహరించాడు ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్. ఆ మ్యాచ్ లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పడు ఇదే బ్యాడ్ సెంటిమెట్ టీమిండియా ఫ్యాన్స్ ఆందోళనకు కారణం అవుతోంది. అయితే ఇదంతా అప్పుడని, ప్రస్తుతం టీమిండియా ఫుల్ స్వింగ్ లో ఉందని.. ఈ మ్యాచ్ లో కచ్చితంగా న్యూజిలాండ్ ను భారత్ మట్టికరిపిస్తుందని మరికొందరు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాడ్ టక్కర్ కు అంపైర్ గా ఈ మ్యాచ్ వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మరి ఈ సెమీస్ లో ఈ బ్యాడ్ సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి