iDreamPost

వీడియో: అటెండర్ కాళ్లు మొక్కిన జిల్లా కలెక్టర్!

వీడియో: అటెండర్ కాళ్లు మొక్కిన జిల్లా కలెక్టర్!

కలెక్టర్ అంటే ఎంత పవర్ ఉంటదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లా మొత్తం ఆయన ఆధీనంలోనే  ఉంటుంది. జిల్లా ఎస్పీ నుంచి మొదలు  అందరూ కలెక్టర్  వస్తే.. లేచి నిలబడాల్సిందే. ఇక కొందరు కలెక్టర్లు అయితే తమ సిబ్బందితో చాలా కఠినంగా ఉంటారు. వారిపై తమ అధికార ప్రతాపం చూపిస్తుంటారు. మరికొందరు మాత్రం నిజాయితీగా ఉంటూ.. కింది స్థాయి ఉద్యోగులకు కూడా మర్యాద ఇస్తుంటారు. కానీ ఎవరైనా కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి.. అటెండర్ కాళ్లకు మొక్కుతారా?. కానీ ఓ జిల్లా కలెక్టర్.. తన కార్యాలయంలో పని చేసి అటెండర్ కాళ్లు మొక్కిండు. అంతేకాక అంతటి విధేయతను ప్రదర్శించిన కలెక్టర్ మన తెలుగు వారే. ఈ గొప్ప వ్యక్తి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణా రాష్ట్రం జమ్మికుంటకు చెందిన దొడ్డే ఆంజనేయులు 2010 ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం జార్ఖాండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ప్రస్తుతం పలామూ జిల్లాకు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జార్ఖండ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో దొడ్డే ఆంజనేయులు కూడా బదిలీ అయ్యారు. పలామూ జిల్లా నుంచి దుమ్కా జిల్లాకు ట్రాన్సఫర్ అయ్యారు. ఈక్రమంలో ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన శిశిరంజన్ కు ఆయన శుక్రవారం బాధ్యతలు అప్పగించారు.

అనంతరం కార్యాలయంలో  ఆయనకు ఏర్పాటు చేసిన వీడ్కొలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆ కలెక్టర్ కు  శాలువాలు కప్పి సన్మానించారు. ఆ తరువాత  ఇంతకాలం తనకు ఆఫీసులో సేవలందించింన కింది స్థాయిల ఉద్యోగులను కలెక్టర్ ఆంజనేయులు సత్కరించారు. ఈ క్రమంలో నంద్ లాల్ అనే అంటెర్ వద్దకు వెళ్లిన ఆంజనేయులు.. అతడిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.  అనంతరం నందలాల్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో కలెక్టర్ చేసిన పనికి ఆటెండర్ షాకయ్యాడు. ఆయన కంటి నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. నందలాల్ ది తన తండ్రి వయస్సు అని.. తన  తండ్రి కూడా వాచ్ మెన్ గా పని చేశాడని ఆంజనేయులు గుర్తు చేసుకున్నారు. బదిలీపై వెళ్తున్న జిల్లా  అధికారి కిందిస్థాయి సిబ్బందికి వీడ్కోలు పలికిన భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. హోదాను పక్కనపెట్టి ఆ కలెక్టర్ తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఈ తెలుగు ఐఏఎస్ అధికారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 6 నెలల బాలుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి