iDreamPost

అతడి కోసం నాకు టికెట్‌ ఇవ్వలేదు.. కన్నీటి పర్యంతమైన పటేల్‌ రమేష్‌

తెలంగాణలో శాసన సభ ఎన్నికలకు సమయం ఆసన్నమౌతోంది. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్ల నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలోనే పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే టికెట్ ఆశించిన వ్యక్తులకు కేటాయించకపోవడంతో..

తెలంగాణలో శాసన సభ ఎన్నికలకు సమయం ఆసన్నమౌతోంది. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎలక్షన్ల నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలోనే పలు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే టికెట్ ఆశించిన వ్యక్తులకు కేటాయించకపోవడంతో..

అతడి కోసం నాకు టికెట్‌ ఇవ్వలేదు.. కన్నీటి పర్యంతమైన పటేల్‌ రమేష్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. ఈ సారి అధికార పీఠాన్ని చేజిక్కుంచుకునేది ఎవ్వరన్నదీ రాజకీయ నేతల్లోనే కాదూ సామాన్యుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ నవంబర్ 30న శాసన సభకు ఎన్నికలు జరగనుండగా.. వచ్చే నెల 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ ప్రక్రియ కుడా ముగింపు దశకు చేరుకుంది. శుక్రవారమే నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఇదిలా ఉంటే.. ఇంకా కొన్ని పార్టీలు.. అభ్యర్థుల జాబితాను దశల వారీగా విడుదల చేశాయి. ఇదే సమయంలో టికెట్ రాని వారు, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ప్రస్తుతం ఉన్న పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజెపీ త్రిముఖ పోటీ నెలకొంది. అసలు సిసలైన గేమ్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్సుకే. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసి.. అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ఇందులో టికెట్ రాని అసంతృప్తులు, అసమ్మతిని తెలియ చేస్తూ మరో పార్టీకి జంప్ చేసేశారు. అయితే కాంగ్రెస్ కూడా మెల్లిగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు పటేల్ రమేష్ టికెట్ ఆశించి భంగపడ్డారు. సూర్యాపేట అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఖారకుచేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తనకు టికెట్ రాకపోవడంపై మండిపడ్డారు రమేష్.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. వరుసగా రెండవ సారి టికెట్ ఆశించి.. భంగపడటం రమేష్ ఆయన సతీమణి లావణ్య రెడ్డి కన్నీరుమున్నీరు అయ్యారు. పార్టీ కోసం అహర్నిశలు క ష్టపడితే.. పార్టీ తనకు ఇచ్చిన ప్రతిఫలం ఇదేనంటూ లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని, ఇదంతా జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే తనకు కాకుండా.. దామోదర్ రెడ్డికి ఇచ్చారంటూ మండిపడ్డారు. అతడికి టికెట్ రాలేదన్న విషయం తెలిసి రమేష్ అనుచరులు జనగాం క్రాస్ రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అనుచరులతో మాట్లాడిన ఆయన.. తదుపరి కార్యాచరణ గురించి వెల్లడిస్తానని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి