iDreamPost

వీడియో: అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసిన కొత్తగూడెం జిల్లా SP!

Kothagudem SP: విధుల్లో బిజీ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు పోలీసులు. ఎప్పుడు చూడూ ఏదో ఒక విధుల్లో, కార్యక్రమాల విషయంలో వారు చాలా సీరియస్ గా వర్క్ లో మునిగిపోతారు. వాళ్లు డ్యాన్సులు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన దృశ్యం ఏకంగా జిల్లా ఎస్పీ ద్వారానే ఆవిష్కృతమైంది.

Kothagudem SP: విధుల్లో బిజీ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు పోలీసులు. ఎప్పుడు చూడూ ఏదో ఒక విధుల్లో, కార్యక్రమాల విషయంలో వారు చాలా సీరియస్ గా వర్క్ లో మునిగిపోతారు. వాళ్లు డ్యాన్సులు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన దృశ్యం ఏకంగా జిల్లా ఎస్పీ ద్వారానే ఆవిష్కృతమైంది.

వీడియో: అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసిన కొత్తగూడెం జిల్లా SP!

వేడుకల్లో సందడి చేయాలని చాలా మందికి ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరు వివిధ కార్యక్రమాల్లో డ్యాన్సు, పాటలు పాడుతు  తెగ ఎంజాయ్ చేస్తారు. ఇలా ప్రత్యేక వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ఎంతో ఉత్సాహంగా గడపుతుంటారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా కీలకమైన పోస్టుల్లో ఉన్న వారు సైతం  తమదైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ మాస్ స్టెప్పులు వేసి..సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విధులు నిర్వహిస్తున్నారు. తనదైన శైలీలో జిల్లాలో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ రోహిత్ రాజ్ తన తోటి అధికారులతో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం కాకుండా అలరించారు. మే 13వ తేదీన జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా ముగించారు.

అలానే  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉండే ఏజెన్సీ జిల్లాల్లో ఎన్నికల బందోబస్తును విజయవంతగా నిర్వహించారు. అందుకు గాను ఎస్పీ రోహిత్ రాజ్ గెట్ టూ గెదర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్నికి ఆయన పాటు ఇతర కీలక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరి సమావేశం కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని ఓ పంక్షన్ హాల్లో నిర్వహించారు. ఆ ఫంక్షన్ ఆహాల్లో పలువురు పోలీస్ ఆఫీసర్లతో కలిసి ప్రైవేటు పార్టీని చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల డ్యాన్సులతో, పాటలతో సందడి చేశారు. ఇక ఆ అధికారులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ కూడా సరదాగా డ్యాన్స్ చేశారు.

మ్యాడ్ మూవీలోని కళ్లజోడు కాలేజీ పాప  సాంగ్ కి ఎస్పీ మాస్ సెప్ట్పులు ఇరగదీశారు. ఎస్పీ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో ఈ వీడియా నెట్టింట వైరల్‌గా మారింది. ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ వేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఓ సందర్భంలో తనదైన డ్యాన్స్ తో రోహిత్ అదరగొట్టారు. కాలేజీ రోజుల నుంచే ఆయన మంచి డ్యాన్సర్ ని తెలిసిన వారు చెబుతున్నారు. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. మొత్తంగా ఎప్పుడు విధుల్లో బిజీ బిజీగా ఉండే పోలీసులు, ఉన్నతాధికారులు  కాస్తా రిలీప్ కోసం ఇలా సరదాగా కాసేపు గడుపుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఎస్పీ రోహిత్ రాజ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి