iDreamPost

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ. 59కే అపరిమిత ప్రయాణం!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ. 59కే అపరిమిత ప్రయాణం!

హైదరాబాద్ నగరంలో మెట్రోకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి గల కారణం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండటం, సమయం వృధా కావడంతో ప్రయాణికులు ఎక్కువగా మెట్రో ప్రయాణానికే ఇష్టపడుతున్నారు. ఉద్యోగులు, కార్మికులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే వారు మెట్రోలో వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమలో ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో శుభవార్తను అందించింది. ప్రయాణికులను, టూరిస్టులను ఆకర్షించే విధంగా అద్భుతమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. రూ. 59 చెల్లించి ఆ రోజుల్లో అపరిమితంగా ప్రయాణించొచ్చు అని తెలిపింది. ఈ ఆఫర్ తో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనున్నది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం హాలీ డే సూపర్ సేవర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 59 చెల్లించి సెలవు రోజుల్లో అపరిమితంగా ప్రయాణించొచ్చు. అయితే హాలిడే సూపర్ సేవర్ ఆఫర్ ప్రస్తుతం రూ. 99 కి అందిస్తున్నారు. కాగా మళ్లీ రూ. 59 కే రీఛార్జ్ చేసుకునేలా ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23 నుంచి అన్ని సెలవు దినాల్లో రూ. 59 చెల్లించి అపరిమితంగా ప్రయాణించొచ్చు. అయితే దీనికోసం హాలిడే సూపర్ సేవర్ కార్డును రూ. 100 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ. 59 తో రీఛార్జ్ చేసుకుని ప్రయోజనాలను పొందవచ్చు. కాగా ఈ ఆఫర్ 2024, మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని ఎల్అండ్‌టీ మెట్రో ఓ ప్రకటనలో తెలిపింది.