iDreamPost

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌!

దేశ వ్యాప్తంగా వర్షాలు బాగా తగ్గిపోయాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప.. మిగిలిన చోట చెదురుమొదురు వర్షాలు పడుతున్నాయి. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎండాకాలాన్ని తలపిస్తోంది. కొన్ని రోజుల ముందు వరకు వర్షాలతో అల్లాడిన ప్రజలు.. ఇప్పుడు ఎండలతో ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై ఓ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. మేఘాలు మాయన్మార్‌నుంచి తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయని వెల్లడించింది.

ఆవర్తనం కారణంగా ఈ రోజునుంచి రెండు రోజల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అంతేకాదు! వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ రోజు ఆరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయిని పేర్కొంది. ఇక, మిగిలిన జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, హిమాచల్‌ ప్రదేశ్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు సృష్టించిన భీభత్సం కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 71 మంది చనిపోయారు. 13 మంది కనిపించకుండాపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అక్కడక్కడా కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి