iDreamPost

భార్యకు అదిరిపోయే గిఫ్టు.. ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త!

ఖర్చు ఎంతైనా వెనకాడరు. ఇదే రీతిలో ఓ భర్త తన భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ బహుమతిని అందించాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. కారు, బంగ్లా, నగలు కాకుండా అరుదైన గిఫ్టును అందించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఖర్చు ఎంతైనా వెనకాడరు. ఇదే రీతిలో ఓ భర్త తన భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ బహుమతిని అందించాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. కారు, బంగ్లా, నగలు కాకుండా అరుదైన గిఫ్టును అందించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

భార్యకు అదిరిపోయే గిఫ్టు.. ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త!

ఇటీవలి కాలంలో తమకు ఇష్టమైన వ్యక్తులకు బహుమతులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్న ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. బర్తుడేలు, వివాహాల్లో ఇంకా స్పెషల్ సందర్బాల్లో విలువైన కానుకలు అందిస్తుంటారు. ఖర్చు ఎంతైనా వెనకాడరు. ఇదే రీతిలో ఓ భర్త తన భార్యకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ బహుమతిని అందించాడు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. కారు, బంగ్లా, నగలు కాకుండా అరుదైన గిఫ్టును అందించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ గిఫ్టు మరేంటో కాదు చంద్రుడి మీద ఎకరం భూమిని కొని అందించాడు. ఇక తన పుట్టిన రోజున ఆ అరుదైన బహుమతిని అందుకున్న ఆమె ఆనందంతో ఎగిరిగంతేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహటో అనే వ్యక్తి అనుమిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు భార్యకు చంద్రుడిపై భూమిని కొని గిఫ్టుగా ఇస్తానని చెప్పిన సంజయ్ అనుకున్నట్లుగానే చంద్రుడిపై ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించి భార్య పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అందించాడు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా భూమిని రూ. 10 వేలకు కొనుగోలు చేసినట్లు సంజయ్ వెల్లడించాడు. భార్యకు పెళ్లికి ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రుడిపై భూమిని కొని భార్యకు బహుమతిగా అందించినట్లు వెల్లడించాడు. ఈ అరుదైన గిఫ్టును అందుకున్న అనుమిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇటీవల భారత అంతరిక్షపరిశోధన సంస్థ చంద్రుడి అన్వేషణ కోసం చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జూలై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 40 రోజుల సుధీర్ఘ ప్రయాణం అనంతరం ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ దృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. దక్షిణ దృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ హిస్ట్రీ క్రియేట్ చేసింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ తో ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రుడిపై పలువురు ల్యాండ్ కొనుగోలు చేయడంతో చర్చకు దారితీస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి