iDreamPost

Human : హ్యూమన్ రిపోర్ట్

Human : హ్యూమన్ రిపోర్ట్

ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన హ్యూమన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు ట్రైలర్ రూపంలో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపింది. పేదవాడి నుంచి ధనవంతుడి దాకా అందరినీ జలగలా పీల్చుకు తింటున్న కార్పొరేట్ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందటంతో అంచనాలు పెరిగాయి. కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సిరీస్ లను ఓటిటిలు హిందీతో పాటు తెలుగు తమిళం తదితర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాయి. హ్యూమన్ కూడా అలాగే వచ్చింది. మొత్తం పది ఎపిసోడ్లకు కలిపి ఏడున్నర గంటల దాకా ఉన్న ఈ సుదీర్ఘమైన హ్యూమన్ అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా సాగిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది భోపాల్ నగరంలో జరిగే కథ. ఓ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా జాయినవుతుంది సైరా సబర్వాల్(కీర్తి కొల్హారి). ఆ సంస్థకు హెడ్ అయిన గౌరీ నాధ్(షెఫాలీ షా)ఇల్లీగల్ పద్ధతుల్లో కొత్తగా కనిపెడుతున్న డ్రగ్స్ ను మనుషుల మీద ప్రయోగాలు చేయిస్తూ ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా రాజకీయ వ్యవస్థను ఆర్థిక బలాన్ని వాడుకుని వాటిని బయటికి రాకుండా చూస్తుంది. అయితే ఇందులో భాగమైన ఓ ప్రభుత్వ వైద్యుడు చేసిన పొరపాటు వల్ల విషయం బయటికి పాకుతుంది. యువకుడైన మంగు(విశాల్ జెత్వా) ఈ విషవిలయంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగేది అసలైన కథ.

బాలీవుడ్ లో బాగా పేరున్న విపుల్ అమృత్ లాల్ షా-మోజెజ్ సింగ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మెడికల్ థ్రిల్లర్ లో టేకాఫ్ బాగున్నప్పటికీ మూడు ఎపిసోడ్లు అయ్యాక అవసరానికి మించిన డ్రాగ్ సహనాన్ని పరీక్షిస్తుంది. కాస్త నిడివి తగ్గించి అయిదారు భాగాలకు పరిమితం చేసుంటే బెస్ట్ వాచ్ అయ్యే అవకాశాలు ఉండేవి. కథాక్రమాన్ని సహజంగా చూపించిన వైనం బాగుంది కానీ పోనుపోను కాస్త అతిశయోక్తిగా మారిపోయి ఇబ్బందిగా అనిపిస్తుంది. హోమో సెక్సువల్ సీన్స్, లిప్ లాక్స్ లేకపోతే వెబ్ సిరీస్ చూడరనే భ్రమ నుంచి బాలీవుడ్ దర్శకులు బయటికి రారేమో. ఫాస్ట్ ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి తీరికైన సమయం చేతిలో చాలా ఉంటే ట్రై చేయండి

Also Read : Ala Vaikunthapurramloo :డబ్బింగ్ చేస్తున్నారు సరే మరి రీమేక్ మాటేమిటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి