iDreamPost

చైతు సినిమాకు ఎప్పుడూ చూడని స్పందన

చైతు సినిమాకు ఎప్పుడూ చూడని స్పందన

రేపు లవ్ స్టోరీ ఊహించిన దానికన్నా భారీ విడుదల దక్కించుకోబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 900కి పైగా స్క్రీన్లలో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇది సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అడ్వాన్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ సుమారు 30 కోట్ల దాకా జరిగినట్టు టాక్ ఉంది కానీ దానికి సంబంధించి అధికారిక సమాచారం ఏమి లేదు. ఇదే నిజమైతే జాతిరత్నాలు లాగా ముప్పై అయిదు కోట్ల దాకా రాబట్టగలిగితే లవ్ స్టోరీ ఈజీగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంటుంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాలే కాక చిన్న పట్టణాల్లోనూ ఆన్ లైన్ బుకింగ్స్ భారీగా ఉండటం క్రేజ్ ఎంతుందో చెబుతోంది.

ఏపిలో ఇంకా సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి కాబట్టి ఎక్కువ థియేటర్లలో లవ్ స్టోరీ వేస్తున్నారు. దానికి తోడు సెకండ్ షోలకు అనుమతులు లేకపోవడంతో ఉదయం 7 నుంచి 9 మధ్యలోనే షోలు పడబోతున్నాయి. నాగ చైతన్యకు మళ్ళీ ఇంత పెద్ద రిలీజ్ దక్కుతుందో లేదో అన్న స్థాయిలో హంగామా జరుగుతోంది. ఒక ప్రేమకథ అందులోనూ ఎమోషన్లను హెవీగా జొప్పించే శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడి సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం శుభ పరిణామమే. కాకపోతే 2 గంటల 45 నిమిషాల నిడివిని బోర్ కొట్టకుండా దర్శకుడు ఎలా నడిపించాడన్నది కీలకంగా మారబోతోంది. రేపు చెప్పుకోదగ్గ పోటీ కూడా ఏదీ లేదు.

ఇప్పుడు అందరి దృష్టి కలెక్షన్ల మీద ఉంది. ఈ హైప్ ని రేపంతా నిలబెట్టుకోగలిగితే డబుల్ డిజిట్ లో పది కోట్లు మొదటి రోజే దాటే అవకాశం ఉందని ట్రేడ్ అంటోంది. అయితే ఇదంత సులభం కాదు కానీ అసాధ్యమని మాత్రం అనలేం. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సైతం ఫస్ట్ డే తెచ్చింది అయిదు కోట్ల లోపే. అలాంటిది డబ్బింగ్ వెర్షన్ లేకుండా ఒక తెలుగు సినిమా రెండంకెల సంఖ్యను చేరుకుంటే మాత్రం అదో సెన్సేషన్ అవుతుంది. సోమవారం దాకా లవ్ స్టోరీ వసూళ్ల ట్రెండ్ ని చూసి తమ రిలీజ్ డేట్లను ప్రకటించేందుకు బడా నిర్మాతలు వెయిటింగ్ లో ఉన్నారు. మరి లవ్ స్టోరీ ఏం చేయబోతోందో రేపు మధ్యాన్నానికి తేలిపోతుంది

Also Read : సంక్రాంతి సినిమాలకు అజిత్ ట్విస్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి