iDreamPost

శాంసంగ్ బంపరాఫర్.. 5G స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 43వేల తగ్గింపు

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపరాఫర్.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 43 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ ను మిస్ చేసుకోకండి.

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపరాఫర్.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 43 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ ను మిస్ చేసుకోకండి.

శాంసంగ్ బంపరాఫర్.. 5G స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 43వేల తగ్గింపు

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. చేతిలో ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి. ఏ సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఇంటర్నెట్ లో క్షణాల్లో పొందే సౌలభ్యం ఉంది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కాగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటికప్పుడు ఫోన్ లను మార్చేస్తుంటారు. బడ్జెట్ లో లభించే కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ కు చెందిన 5జీ ఫోన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా ఆ స్మార్ట్ పోన్ పై రూ. 43 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. కొత్త ఫోన్లు మార్కెట్ లోకి వస్తే చాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. కాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధరపై 58 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ- కామర్స్ సంస్థలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ అసలు ధర రూ.74,999గా ఉంది. డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ.31,769కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక్కడ కస్టమర్లకు రూ.43,230 భారీ తగ్గింపు లభిస్తుంది. 8.జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ను రూ.31,769 కే దక్కించుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను 1540 ఈఎంఐతో.. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందొచ్చు. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, నేవీ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.4-అంగుళాల పూర్తి-హెచ్డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే, 12ఎంపీ + 12ఎంపీ + 8ఎంపీ (ఓఐఎస్) కెమెరా సెటప్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ ఆప్షన్ ను కలిగి ఉంది. మరి మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి