iDreamPost

నేటి నుంచే సాధారణ భక్తులకు బాల రాముడి దర్శనం.. పూర్తి వివరాలు!

Ayodhya Darshan Rules And Transportation: అయోధ్య రామయ్యను దర్శించుకోవాలి అనుకునే భక్తులు ఈ వివరాలను తప్పకుండా తెలుసుకోవాల.

Ayodhya Darshan Rules And Transportation: అయోధ్య రామయ్యను దర్శించుకోవాలి అనుకునే భక్తులు ఈ వివరాలను తప్పకుండా తెలుసుకోవాల.

నేటి నుంచే సాధారణ భక్తులకు బాల రాముడి దర్శనం.. పూర్తి వివరాలు!

500 ఏళ్లుగా కోట్ల మంది కన్న కల సోమవారం సాకారం అయ్యింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ప్రపంచం మొత్తం ఒక్కసారి అయోధ్యవైపు చూసింది. ఈ బృహత్కార్యాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది మీడియాలో చూసి తరించారు. ప్రాణ ప్రతిష్ట రోజు కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. మరి.. సాధారణ భక్తులకు ఎప్పటి నుంచి దర్శనం, ఎలా దర్శనం చేసుకోవాలి అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి.. సాధారణ భక్తులు ఎలా దర్శనం చేసుకోవాలి? దర్శనం వేళలు ఏంటి? పూర్తి వివరాలను తెలుసుకోండి.

దర్శనం వేళలు:

ఎప్పుడెప్పుడు ఆ బాల రాముడి దర్శనం చేసుకోవాలి అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రామ భక్తులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే జనవరి 23 అంటే మంగళవారం నుంచే అయోధ్యలో సాధారణ భక్తులకు దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు, అలాగే హారతి, దర్శనం వేళలను కూడా అయోధ్య అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన వివరాల ప్రకారం.. ఉదయం 6.30 గంటలకు జాగరణ హారతి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఉదయం 11.30 గంటల వరకు అయోధ్య రామయ్య దర్శనం కొనసాగుతుంది.

Ramaiah Darshan Do not make these mistakes

ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది. అలాగే 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది. జాగరణ హారతి, సంధ్యా హారతిని దర్శించుకోవాలని కోరుకునే భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగరణ హారతిని దర్శించుకోవాలి అనుకునే వాళ్లు ముందురోజు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సంధ్యా హారతి చూడాలనుకునే వాళ్లు అదే రోజు బుక్ చేసుకున్నా సరిపోతుందని వెల్లడించారు.

ఆన్ లైన్ లో బుకింగ్:

అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవాలి అనుకునేవాళ్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మీరు ఏ రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజుకు స్లాట్ బుక్ చేసుకోవాలి. ముందుగా మీరు అధికారిక వెబ్ సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబరుతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. హారతీ, దర్శనం ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చు. హారతి అయితే నిర్దిష్టమైన సమయాల్లో మాత్రమే ఉంటుంది. అలాగే దర్శనానికి సంబంధించి ట్రస్టు చెప్పిన సమయాల్లో మీకు నచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

అలాగే బుక్ చేసే వ్యక్తి గుర్తింపు కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. మీతోపాటు ఎంతమంది దర్శనానికి వస్తున్నారు అనే విషయాన్ని కూడా వెల్లడించాలి. అలాగే మీరు దర్శనానికి వెళ్లే సమయంలో ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అవేంటంటే.. సాంప్రదాయ దుస్తుల్లోనే మీరు దర్శనానికి వెళ్లండి. వెస్ట్రన్ స్టైల్ దుస్తులు, అభ్యంతరకర రీతిలో ఉండే దుస్తుల్లో వెళ్లే వారికి అయోధ్య రామ మందిరంలో ప్రవేశాన్ని నిలిపివేస్తారు. అలాగే దర్శనానికి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా వారితో పాటు గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ధృవీకరణ పత్రంలేని వారికి దర్శనానికి అనుమతి ఇవ్వరు. కాబట్టి ఈ తప్పులను మాత్రం చేయకండి.

ఎలా చేరకోవాలి?:

అయోధ్యను చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలు నగరాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఢిల్లీ, లక్నో, కోల్ కతా, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. అయోధ్యకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రామాలయానికి చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒకేరోజు అయోధ్య రామయ్యను- కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య- కాశీ మధ్య హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. అవి ప్రారంభం అయ్యాక భక్తులు ఒకేరోజు రామయ్యను- కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి