iDreamPost

ఇన్ స్టాలో మిమ్మల్ని బ్లాక్ చేశారనే డౌటుందా? ఇలా తెలుసుకోండి

How to Know If Someone Blocked You In Instagram: ఇన్ స్టాగ్రామ్ అనేది ఇప్పుడు విస్తృతంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. అయితే ఈ యాప్ లో ఎవైరనా మిమ్మల్ని బ్లాక్ చేశారనే అనుమానం మీకుంటే ఇలా చెక్ చేసుకోండి.

How to Know If Someone Blocked You In Instagram: ఇన్ స్టాగ్రామ్ అనేది ఇప్పుడు విస్తృతంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్. అయితే ఈ యాప్ లో ఎవైరనా మిమ్మల్ని బ్లాక్ చేశారనే అనుమానం మీకుంటే ఇలా చెక్ చేసుకోండి.

ఇన్ స్టాలో మిమ్మల్ని బ్లాక్ చేశారనే డౌటుందా? ఇలా తెలుసుకోండి

భారతదేశంలో ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో అకౌంట్స్ బ్యాన్ అయ్యాయి. ముఖ్యంగా డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి యాప్స్ పోయిన తర్వాత అందరూ ఇన్ స్టాగ్రామ్ వైపు మళ్లారు. ఫొటోలు, రీల్స్, స్టోరీలు అంటూ ఇన్ స్టాగ్రామ్ ని వాడేస్తున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఫ్రెండ్స్, సర్కిల్ అన్నీ ఉంటాయి. అలాగే ఎవరినైనా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫీచర్ ప్రకారం వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారనే విషయం కూడా మీకు తెలియదు. వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. వాళ్లు అసలు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారో లేదో కూడా క్లారిటీ ఉండదు. అయితే ఇలాంటి సందర్భాల్లో మీరు కొన్ని రకాలుగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

సెర్చ్ ఫీచర్:

ఇన్ స్టాగ్రామ్ లో ఒకరు మిమ్మల్ని బ్లాక్ చేశారనే విషయాన్ని త్వరితగతిన తెలుసుకునేందుకు మీకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే.. సెర్చ్ ఫీచర్ ని యూజ్ చేయడం. అవును ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న సెర్చ్ ఫీచర్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే తేలిగ్గా తెలుసుకోవచ్చు. మీరు ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లి వాళ్ల యూజర్ నేమ్ ని సెర్చ్ చేయండి. మీకు వాళ్ల ప్రొఫైల్ గనుక రాకుండా ఉంటే మాత్రం సదరు అకౌంట్ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అని గ్రహించ వచ్చు. అయితే వాళ్ల ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని డిలీట్ చేసినా కూడా మీకు చూపించకపోవచ్చు. అంటే అయితే డిలీట్ చేసుండాలి.. లేదంటే బ్లాక్ చేసుండాలని అర్థం.

వేరే అకౌంట్ ద్వారా:

సాధారణంగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారి అకౌంట్ మీ ఇన్ స్టాగ్రామ్ లో కనిపించదు. అలాంటప్పుడు మీకు వేరే అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ద్వారా వారి యూజర్ నేమ్ ని సెర్చ్ చేయండి. అలా చేస్తే మీకు వాళ్ల అకౌంట్ కనిపిస్తే గనుక వాళ్లు మిమ్మల్ని పక్కా బ్లాక్ చేశారని అర్థం. ఒకవేళ ఈ అకౌంట్ వివరాలు కూడా వారికి తెలిసి ఉంటే రెండింటిని బ్లాక్ చేసే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా ఆ యూజర్ నేమ్ ని సెర్చ్ చేయమని చెప్పండి. వారికి గనుక ప్రొఫైల్ చూపిస్తే మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు. వారికి కూడా ప్రొఫైల్ కనిపించకపోతే వాళ్లు తమ అకౌంట్ ని డిలీట్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.

వెబ్ ప్రొఫైల్:

ప్రతి ఇన్ స్టాగ్రామ్ యూజర్ కు ఒక యునీక్ నేమ్ ఉంటుంది. అది కేవలం వారికి మాత్రమే కేటాయించి ఉంటుంది. అలాంటి ప్రొఫైల్ ని మీరు వెబ్ పేజ్ లో ఈజీగా ఓపెన్ చేయచ్చు. మీరు బ్రౌజర్ లో Instagram.com/వాళ్ల యూజర్ నేమ్ ని టైప్ చేయండి. మీకు వారి ప్రొఫైల్ ఓపెన్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు కాదు. ఒకవేళ వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వస్తే మాత్రం వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారని విషయాన్ని గ్రహించండి.

మెన్షన్/ట్యాగ్:

ఇంకో విధానం ద్వారా కూడా మీరు ఒక యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేశారాల లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అందుకు మీరు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న మెన్షన్/ట్యాగ్ ఫీచర్స్ ని వాడుకోవచ్చు. మిమ్మల్ని ఏ యూజర్ అయినా బ్లాక్ చేసి ఉంటే వారిని మీరు మెన్షన్ గానీ, ట్యాగ్ గానీ చేయలేరు. అలాంటి సమయంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఒక ప్రొఫైల్ ప్రైవేట్ అని చూపిస్తే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు కాదు. మీరు ఫాలో బటన్ కొట్టాలి. వాళ్లు మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ల ప్రొఫైల్ ని చూడచ్చు. పబ్లిక్ పేజెస్ ని విజిట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం క్లారిటీ తెచ్చుకోండి. ఒకళ్లు మిమ్మల్ని బ్లాక్ చేశారు అంటే వారికి మీ నుంచి ఏదో అసౌకర్యం ఏర్పడి ఉండచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి