iDreamPost

Ravi Bishnoi: అతి తక్కువ కాలంలో నెం.1 బౌలర్‌ రవి బిష్ణోయ్‌! ఇది ఎలా సాధ్యమైంది?

  • Published Dec 07, 2023 | 6:20 PMUpdated Dec 09, 2023 | 4:00 PM

టీమిండియా యంగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కొత్త చరిత్ర లిఖించాడు. అతి తక్కువ కాలంలోనే టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎదిగాడు. అయితే.. ఇంత తక్కువ టైమ్‌లో రవి ఇది ఎలా సాధించాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యంగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కొత్త చరిత్ర లిఖించాడు. అతి తక్కువ కాలంలోనే టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎదిగాడు. అయితే.. ఇంత తక్కువ టైమ్‌లో రవి ఇది ఎలా సాధించాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 07, 2023 | 6:20 PMUpdated Dec 09, 2023 | 4:00 PM
Ravi Bishnoi: అతి తక్కువ కాలంలో నెం.1 బౌలర్‌ రవి బిష్ణోయ్‌! ఇది ఎలా సాధ్యమైంది?

ఐసీసీ ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ బౌలర్‌ రవిబిష్ణోయ్‌ సత్తాచాటాడు. 699 రేటింగ్‌తో టీ20 క్రికెట్‌లో నంబర్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా ఇండియన్‌ మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బిష్ణోయ్‌ కూడా నంబర్‌ వన్‌ స్థానాన్ని అదిరోహించడంతో.. టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ వన్‌ బ్యాటర్‌, బౌలర్‌ ఇద్దరూ భారత ఆటగాళ్లే కావడం విశేషం. అయితే.. రవి బిష్ణోయ్‌ టీ20 క్రికెట్‌లోకి అడుగు పెట్టి ఇంకా సరిగ్గా రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, అప్పుడు ప్రపంచ నంబర్‌ బౌలర్‌గా ఎదిగాడు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత పెద్ద సక్సెస్‌ ఎలా సాధ్యమైందని క్రికెట్‌ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2022 ఫిబ్రవరి 16న వెస్టిండీస్‌-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌తో టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రవి బిష్ణోయ్‌. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫాస్ట్‌ ఫుడ్‌ లాంటి టీ20 క్రికెట్‌లో బ్యాటర్లదే హవా. అలాంటి టీ20 క్రికెట్‌లో బిష్ణోయ్‌ రాణిస్తూ.. 21 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టారు. ఒక మ్యాచ్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. అయితే.. టీ20 క్రికెట్‌లో రవి బిష్ణోయ్‌ ఎంతో నిలకడగా రాణిస్తుండటం, ప్రతి మ్యాచ్‌లో వికెట్లు పడగొడుతుండటంతో.. అతని రేటింగ్‌ అలా అలా పెరుగుతూ పోయింది. అలాగే ఇతర బౌలర్లు టీ20 క్రికెట్‌లో విఫలం అవుతుండటం, టీ20 క్రికెట్‌పై కాకుండా.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం ఏడాది కాలం వన్డేలపైనే ఫోకస్‌ పెట్టడంతో బిష్ణోయ్‌కి కలిసొచ్చింది.

ravi bishnoi world no1 bowler

 

ఇక రవి బిష్ణోయ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. 692 రేటింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగా, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ ఆదిల్‌ రషీద్‌ 679 సమాన రేటింగ్‌తో ఉన్నారు. కాగా, ఐసీసీ టీ20 టాప్‌ 10 బౌలర్లలో రవి బిష్ణోయ్‌ ఒక్కడే ఉండటం గమనార్హం. ప్రస్తుతం బిష్ణోయ్‌ కొనసాగిస్తున్న ఫామ్‌ను కంటిన్యూ చేస్తే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. మరి రవి బిష్ణోయ్‌ ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి