iDreamPost

అయోధ్య.. శ్రీరాముని జన్మస్థలమని కోర్టులో ఎలా నిరూపించారు? 1045 పేజీల తీర్పు!

2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే శ్రీరాముని జన్మస్థలమని కోర్టులో ఎలా నిరూపించారు. ఏ విధమైన ఆధారాలు కోర్టులో సమర్పించారు?

2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే శ్రీరాముని జన్మస్థలమని కోర్టులో ఎలా నిరూపించారు. ఏ విధమైన ఆధారాలు కోర్టులో సమర్పించారు?

అయోధ్య.. శ్రీరాముని జన్మస్థలమని కోర్టులో ఎలా నిరూపించారు? 1045 పేజీల తీర్పు!

అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వందల ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రామ్ మందిర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం కోసం ఎంతో మంది పోరాటం, ఎందరిదో త్యాగ ఫలితమే నేటి రామ్ మందిర్ నిర్మాణం. బాబ్రీ మసీదు, అయోధ్య రామ్ మందిర్ మధ్య స్థల వివాదం ఏళ్లకేళ్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదోపవాదనల అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

సున్నీ వక్ఫ్ బోర్డుకి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది. అయితే శ్రీరాముని జన్మస్థలమని కోర్టులో ఎలా నిరూపించారు. ఏ విధమైన ఆధారాలు కోర్టులో సమర్పించారు? అసలు ఈ ఆ స్థలం రామ జన్మభూమిదే అని తెలిపే ఆధారాలను ఎలా సంపాదించారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్య రామ మందిరం, స్కంద పురాణం !

హిందువులు శ్రీరాముని జన్మస్థలాన్ని కోర్టులో నిరూపించడానికి దోహదపడిన అంశాలు.. ఒక రాతి స్తంభం, అసంపూర్ణ మ్యాప్, ఒక పురాతన పుస్తకం, మరియు దైవిక జోక్యం. ఈ ఆధారాలే అయోధ్యా తీర్పులో అత్యంత కీలకంగా మారాయి. భారత్ ను బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న సమయంలో 1902లో బ్రిటీష్ అధికారులు ఎడ్వర్డ్ స్కంద పురాణం నుంచి అయోధ్యలోని మొత్తం 148 తీర్థ స్థలాలను తెలియజేస్తూ, ఆ స్థలాలపై సంఖ్యలతో కూడిన రాతి బోర్డులను(స్తంభం) ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలను ఎవరైనా తొలగిస్తే రూ. 3000 జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ స్తాంబాలు అయోధ్య తీర్పులో కీలకపాత్ర పోషించాయి.

Hindus the birthplace of Lord Rama

2005లో స్వామి అవిముక్తేశ్వరానందతో కలిసి లాయర్ పిఎన్ మిశ్రా లక్నో నుంచి కలకత్తాకు కారులో వెళ్తుండగా దారి తప్పి అయోధ్యకు చేరుకున్నారు. ఈ సమయంలో లక్నోలో అతను ఒక సాధువుని కలుసుకున్నాడు, కేవలం ఒక సాధారణ సంభాషణలో, అయోధ్యలో ఎన్ని తీర్థాలు ఉన్నాయని అడిగారు. దానికి బదులుగా సాధువు 148 అని బదులిస్తారు. ఈ సమాచారం మీకు ఎలా తెలుసునని పిఎన్ మిశ్రా ఆ సాధువుని అడిగారు. 1980లో హన్స్ బక్కర్ అనే చరిత్రకారుడు అయోధ్యకు వచ్చారని సాధు చెప్పారు.

అతనే సర్వే చేసాడు, ఒక పుస్తకం వ్రాసాడు మరియు 5 మ్యాప్‌లను రూపొందించాడని చెప్పడు. దీంతో ఆశ్చర్యపోయిన పిఎన్ మిశ్రా ఆ రాతి పలకలను చూపించమని కోరాడు. ఈ క్రమంలో పీఎన్ మిశ్రా అక్కడ ఒక రాతి పలకను చూస్తాడు. పిల్లర్ నం 100.. 8 అడుగుల లోతైన బావిలో వినాయకుని విగ్రహం కూడా ఉంది. వాటిని చూసిన పిఎన్ మిశ్రా అక్కడనుంచి కలకత్తా బయలుదేరారు. 2019లో సుప్రీం కోర్టులో రామజన్మభూమి కేసు విచారణ కొనసాగుతోంది. రాముడి జన్మస్థలాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి హిందువులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రాముడి జన్మస్థలాన్ని నిరూపించే ఆధారాలు:

సంత్ సమాజ్ నుండి న్యాయవాది అయిన పిఎన్ మిశ్రా ఇలా సమాధానమిచ్చారు.. స్కంద పురాణం పురాతన హిందూ గ్రంథం. హిందూ తీర్థయాత్ర యొక్క గూగుల్ మ్యాప్. ఇది అన్ని హిందూ తీర్థాల భౌగోళిక స్థానాలను కలిగి ఉంది. వైష్ణవ ఖండం/అయోధ్య మహాతమ్యలో రాముని జన్మస్థలం యొక్క ఖచ్చితమైన ప్రదేశం ప్రస్తావించబడింది. అందులో “సరయూ నదికి పశ్చిమాన విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఈ ప్రదేశానికి ఈశాన్యంలో రాముడి జన్మస్థలం ఖచ్చితంగా ఉంది. ఇది విఘ్నేశ్వర్‌కు తూర్పున, వశిష్టకు ఉత్తరాన మరియు లౌమాసాకు పశ్చిమాన ఉంది” అని తెలిపారు. అయితే ఈ సమయంలో సీజేఐ మీ దగ్గర ఏదైనా మ్యాప్ ఉందా అని అడిగారు. ఆ సమయంలో పీఎన్ మిశ్రా అవును, స్కంద పురాణం ఆధారంగా ఉంచబడిన.. ఎడ్వర్డ్ రాతి స్తంబం ఆధారంగా రూపొందించబడిన మ్యాప్‌లను కలిగి ఉన్న చరిత్రకారుడు హన్స్ బక్కర్ పుస్తకం ఉందని కోర్టుకు తెలిపారు. వెంటనే పుస్తకాన్ని సమర్పించాలని సీజేఐ ఆదేశించారు.

ఈ కొత్త సాక్ష్యం కోర్టులో సంచలనం సృష్టించింది:

స్కంద పురాణం రామ జన్మస్థలం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొంది. ఎడ్వర్డ్ స్కంద పురాణం ఆధారంగా స్టోన్ బోర్డ్‌లను (రాతి పలకల) ఏర్పాటు చేశాడు. హాన్స్ బేకర్ ఆ 148 రాతి పలకల ఆధారంగా మ్యాప్‌ను సిద్ధం చేశాడు. కాబట్టి అయోధ్య తీర్పులో ఇది కీలకంగా మారింది.

Hindus the birthplace of Lord Rama

కానీ ఒక సమస్య:

రాముడి యొక్క జన్మస్థలం వినాయకా స్వామికి ఈశాన్యంలో ఉందని చెప్పే స్కంద్ పురాణాన్ని పరిశీలిస్తే, హన్స్ బక్కర్ పుస్తకంలో రాముడి ఖచ్చితమైన జన్మస్థలం యొక్క మ్యాప్ స్పష్టంగా లేదు మరియు ఆ మ్యాప్ ప్రకారం, రాముడు పుట్టిన ప్రదేశం సరిపోలలేదు. ఈ సమయంలో ఈ కేసు లో ఒక అద్బుతం జరుగుతుంది. శంకరాచార్య, అవిముక్తేశ్వరానందలకు పిఎన్ మిశ్రా ఫోన్ చేసి ఈ మిస్టరీని ఛేదించాలని కోరారు. వెంటనే వారు అయోధ్యను సందర్శించి రహస్యాన్ని ఛేదించారు. అవిముక్తేశ్వరానంద సాక్షి నంబర్ DW 20/02 సుప్రీంకోర్టుకు వచ్చి చెప్పారు. స్కంద పురాణంలో పేర్కొన్న విఘ్నేశుడు, మ్యాప్ లోని విఘ్నేశ్వరుని ఆలయం కాదు, బావిలో వినాయకుని విగ్రహం వున్న స్తంభం సంఖ్య 100 అని, అదే విఘ్నేష్‌ మందిరం తీసుకున్నందున, అన్ని రహస్యాలు ఛేదించబడ్డాయి.

స్తంభం నంబర్ 100కి ఈశాన్యంలో రాముడు జన్మించాడని వారు కోర్టులో విన్న విస్తారు. అవిముక్తేశ్వరానంద సాక్ష్యం కేసును మార్చివేసింది. అవిముక్తేశ్వరానంద చెప్పిన సాక్ష్యంతో ముస్లిం పక్షం వారు కేసులో ఓడిపోయారు. అయితే ఈ సమయంలో ముస్లిం పక్షం వాళ్లు కేసును రక్షించడానికి శంక్రాచార్య సాక్ష్యం తప్పు అని నిరూపించడానికి కోర్టు అనుమతి కోరుతారు. ఈ క్రమంలో 10 రోజుల పాటు విచారణ సాగుతుంది. అవిముక్తేశ్వర్ గారు వారి ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన ఆధారాలు సమర్పించారు. ఎట్టకేలకు స్కంద పురాణం, ఎడ్వర్డ్ స్టోన్‌బోర్డ్, హెన్స్ బక్కర్ మ్యాప్ మరియు స్వామి అవిముక్తేశ్వరానంద సాక్ష్యం ఆధారంగా ముస్లిం పక్షం లొంగిపోయింది. సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తాను 2005లో అయోధ్యకు వెళ్లకపోతే, ఆ సాధువును కలవకపోయుంటే రామ జన్మ స్థానాన్ని కోర్టులో ఎప్పుడూ నిరూపించుకోలేకపోయేవారమని పిఎన్ మిశ్రా అన్నారు. ఇది దైవిక జోక్యం అని ఆయన అన్నారు.1045 పేజీలలో అయోధ్య మీద సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పు సారాంశం మీరు గూగుల్ లో సెర్చ్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 2019, నవంబరు 9 అయోధ్యపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్‌లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణా నికి 5ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 ఫిబ్రవరి 5న అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 15 సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5 ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2024, జనవరి 22న అయోధ్య రామ్ మందిర్ లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కన్నుల పండగగా జరుగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి