iDreamPost

పిల్లల్ని కనడం కన్నా కుక్క పిల్లను పెంచుకోవడం బెటర్ : నటి కామెంట్స్

తల్లి కావాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. అమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంది. కానీ మాతృత్వం , పిల్లలు కనడంపై ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకు ఆమె ఏం అన్నదంటే..?

తల్లి కావాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. అమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంది. కానీ మాతృత్వం , పిల్లలు కనడంపై ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకు ఆమె ఏం అన్నదంటే..?

పిల్లల్ని కనడం కన్నా కుక్క పిల్లను పెంచుకోవడం బెటర్ : నటి కామెంట్స్

పెళ్లైన స్త్రీ మాతృత్వం వరంగా భావిస్తుంటుంది. తల్లి అయితే మహిళగా పరిపూర్ణత లభిస్తుందని అనుకుంటుంది.  అమ్మ అనే పిలుపుకోసం పరితపిస్తూ ఉంటుంది. అది సామాన్యురాలైనా, సెలబ్రిటీైనా. పెళ్లై కొన్నాళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే.. సమాజం చూసే చూపులను, గోడ్రాలు అన్న బిరుదును తగిలించుకోవడానికి సిద్ధంగా ఉండదు. దాంపత్య జీవితంలో సమస్య ఎవరిదైనా ..చీవాట్లు, ఈసడింపులు మాత్రం మహిళకే. అందుకే అమ్మ అవ్వాలని, ఓ బిడ్డతో ఆడుకోవాలని ప్రతి ఆడ పిల్ల కోరుకుంటుంది. కానీ నేటి యువతలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. సెటిల్ అయ్యాకే పిల్లలు అని కండిషన్లతో కాపురాలు చేస్తున్నారు. కొన్నాళ్లకైనా బిడ్డల్ని కనాలన్న రూల్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ సెలబ్రిటీ మాత్రం అసలు పిల్లలే వద్దనుకుంటోంది.

కన్నడ పాపులర్ నటుడు సిహీ కహీ చంద్ర కుమార్తె హితా చంద్ర శేఖర్ తనకు పిల్లలు వద్దని అంటోంది. కుక్క పిల్లల్ని పెంచుకోవడం బెటర్ అని కామెంట్స్ చేసింది. హితా 2017లో 1/4 కేజీ ప్రీతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. పలు కన్నడ సినిమాల్లో నటించింది. సైలెన్స్ కెన్ యు హియర్ అనే చిత్రంతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కన్నడలో వచ్చిన యువ అనే చిత్రంలో మెరిసింది ఆమె. 2019లో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న టీవీ, సినీ నటుడు కిరణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లై నాలుగేళ్లు దాటుతున్నా వీరికి పిల్లలు లేకపోడంపై వస్తున్న వార్తలపై తాజాగా ఆమె షో ద్వారా స్పందిచింది. ఆమె మాట్లాడుతూ..

‘నాకు పిల్లల్ని కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి చర్చించుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించాడు. సొంత పిల్లలు ఎందుకు కావాలి..? ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఓ బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అని నా ఆలోచన. కిరణ్‌కి అలాగే అనిపించింది. మాతృత్వ మాధుర్యాన్ని పొందాలంటే సొంతంగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్క పిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు. చాలా మంది అంటుంటారు. మనం పెద్దయ్యాక.. వృద్దాప్యం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో మనల్ని చూసుకునేది ఎవరు అని ప్రశ్నిస్తారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధలేదు’ అని తెలిపింది హితా చంద్రశేఖర్.

‘ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది. ఈ రోజుల్లో ఎంత మంది తమ తల్లిదండ్రుల్ని చూస్తున్నారు. కొడుకు లేదా కుమార్తె అమెరికాలో లేదా ఎక్కడో దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు మరో చోట ఉంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నా ఏం లాభం అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మాకే సమయం ఉండటం లేదు. అలాంటప్పుడు పిల్లల్ని కని.. వారిని సరిగా చూడకపోతే.. ప్రయోజనం ఏంటీ.? తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు పోతే.. ఒంటరిగా వారి జీవితం ఎలా ఉంటుంది. వాళ్లను ఎవరు చూసుకుంటారు. పిల్లల్ని కనొద్దని చెప్పట్లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయం గురించి మా పేరెంట్స్‌కు కూడా చెప్పాను. ఇక నేను ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’అని పేర్కొంది హిత.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి