iDreamPost

లాక్ డౌన్ వేళ ఆపన్న హస్తం అందించిన ఎమ్మెల్యేల చేతికి నోటీసులు

లాక్ డౌన్ వేళ ఆపన్న హస్తం అందించిన   ఎమ్మెల్యేల చేతికి నోటీసులు

కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంక్షోభ సమయంలోనూ ఆంధ్రాలో రాజకీయ కొట్లాటలు , కోర్టు వివాదాలు ఆగకపోగా మరిన్ని పిటిషన్లు విచారణలతో హోరెత్తుతుంది.

తాజాగా లాక్ డౌన్ సమయంలో బీదసాదలకు నిత్యావసరాలు , కూరగాయలు వంటివి సొంత నిధులతో పంచిన , సంక్షేమ పథకాల అమలు స్వయంగా పర్యవేక్షించిన ఐదుగురు అధికార వైసీపీ ఎమ్మెల్యేల పై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని , కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని దాఖలైన పిటిషన్ ను విచారించిన హై కోర్ట్ సదరు ఎమ్మెల్యేలు విడుదల రజని , ఆర్కే రోజా , బియ్యపు మధుసూదన్ రెడ్డి , కిలివేటి సంజీవయ్య , వెంకట గౌడ లకు వారం లోగా వివరణ ఇమ్మంటూ నోటీసులు జారీ చేసింది .

అలాగే నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్న ఐదుగురు ఎమ్మెల్యేలు నిజంగా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్న అంశాలు , ఉల్లంఘిస్తే ఎం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీకి , ప్రభుత్వానికీ ఆదేశాలు జారీ చేసింది .

అయితే ఈ ఎమ్మెల్యేలు సహాయ కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించారా లేదా , వారికి నిర్ధారణ కానీ కరోనా వ్యాప్తికి ఏ విధంగా కారణమయ్యారో విచారణలో తేలాల్సి ఉంది .

కాగా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సొంత నిధులతో సహాయం అందిస్తున్న ప్రజా ప్రతినిధుల పై ఇలాంటి పిటిషన్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమని , ఇలాంటి చర్యల వలన ఒకరికొకరు అండగా నిలవాల్సిన విపత్కర పరిస్థితుల్లో పది మందికి సాయం చేసే పెద్ద మనసు గలవారు వెనకంజ వేసే పరిస్థితి ఏర్పడుతుందని ఈ వార్త చూసిన పలువురు సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి