iDreamPost

OTTలోకి వచ్చేసిన హాయ్‌ నాన్న.. ఎందులో చూడొచ్చంటే

హాయ్‌ నాన్న డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. మూవీకి మంచి టాక్‌ వచ్చింది.

హాయ్‌ నాన్న డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. మూవీకి మంచి టాక్‌ వచ్చింది.

OTTలోకి వచ్చేసిన హాయ్‌ నాన్న.. ఎందులో చూడొచ్చంటే

న్యాచురల్‌ స్టార్‌ నానీ-మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ‘హాయ్‌ నాన్న’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శౌర్యవ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్‌ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లో మూవీకి మంచి స్పందన లభించింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా హాయ్‌ నాన్నకు మంచి రివ్యూలు ఇచ్చారు.

ఇక, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్ట్రీమింగ్‌ ఎప్పుడనే దానిపై గత కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా, హాయ్‌ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ మూవీ జనవరి 4వ తేదీనుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవ్వనుంది. నెట్‌ఫ్లిక్స్‌ హాయ్‌ నాన్న ఓటీటీ హక్కుల్ని భారీ మొత్తానికే కొన్నట్లు సమాచారం.

కాగా, కొత్త దర్శకుడు శౌర్యవ్‌ ఎంతో నేర్పుగా ఓ కుటుంబ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కథను ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లారు. స్క్రీన్‌ ప్లే విషయంలో శౌర్యవ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ప్రధాన పాత్రధారులైన నానీ, మృణాల్‌, కియారాలు ది బెస్ట్‌ నటనను తెరపై చూపించారు. ఇక, ఈ సినిమా పాటలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన టెక్నికల్‌ టీం కూడా ది బెస్ట్‌ అవుట్‌ పుట్‌ వచ్చేలా పని చేశాయి.

ఇంతకీ హాయ్‌ నాన్న సినిమా కథ ఏంటంటే.. 

విరాజ్‌ ( నాని) ఎప్పటికైనా ఓ గొప్ప ఫొటోగ్రాఫర్‌ అవ్వాలని కలలుకంటూ ఉంటాడు. ఇందుకోసం ఓ పెద్ద ఫొటో గ్రాఫర్‌ దగ్గర అప్రెంటిస్‌గా పనిలో చేరతాడు. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో విరాజ్‌కు యశ్న( మృణాల్‌ ఠాకూర్‌) కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు. తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెబుతాడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేని ఆమె విరాజ్‌కు మొదట నో చెబుతుంది. తర్వాత అతడితో ప్రేమలో పడుతుంది.

అతి కష్టంగా యశ్న ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా వీరి పెళ్లి జరుగుతుంది. పిల్లలు కనే విషయంలోనూ ఇద్దరికీ గొడవలు అవుతాయి. విరాజ్‌ పిల్లలు కావాలని, యశ్న పిల్లలు వద్దని అంటుంది. చివరకు విరాజ్‌ మాటలే యశ్న విలువ ఇస్తుంది. ఓ పాప పుట్టిన తర్వాత వారి జీవితంలో ఏం చోటుచేసుకుంది అన్నదే మిగిలిన కథ.  మరి, హాయ్‌ నాన్న ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి