iDreamPost

హాయ్‌ నాన్న ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత వసూలు చేసిందంటే..

హాయ్‌ నాన్న ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది..

హాయ్‌ నాన్న ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది..

హాయ్‌ నాన్న ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత వసూలు చేసిందంటే..

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ సినిమా డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. హాయ్‌ నాన్న తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. ఓవర్‌సీస్‌లో కూడా డిసెంబర్‌ 7వ తేదే రిలీజ్‌ అయింది. ఈ చిత్రంలో నానికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శౌర్యవ్‌ దర్శకత్వం వహించారు.

కియారా ఖన్నా, జయరామ్‌, ప్రియదర్శి, అంగద్‌ బేడీ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. మొదటి రోజు దాదాపు 10 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మొదటిరోజు ఏకంగా 350కే డాలర్లు కొల్లగొట్టింది. అదే మన ఇండియన్‌ కరెన్సీలో అయితే.. 2.9 కోట్ల రూపాయలు అన్నమాట. అంతేకాదు! రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 4-4.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ క్రిష్ణలో 14 లక్షలు.. గుంటూరులో 12 లక్షలు.. నెల్లూరులో 5 లక్షలు కలెక్ట్‌ చేసినట్లు సమాచారం. నాని గత సినిమాల కలెక్షన్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హాయ్‌ నాన్న సినిమాపై పెద్దగా బజ్‌ లేదు. దీంతో ఈ మాత్రం డీసెంట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇక, హాయ్‌ నాన్న ఓటీటీ రిలీజ్‌ విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. డిసెంబర్‌ చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

హాయ్‌ నాన్న కథ.. ఇతర విషయాలకు వస్తే.. 

కొత్త దర్శకుడు శౌర్యవ్‌ సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు. స్క్రీన్‌ ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కథ కొత్తదేమీ కాకపోయినా.. కథనంతో సినిమాపై ఆసక్తి పెంచాడు. ట్విస్టులతో వ్వావ్‌ అనిపించాడు. మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసింది.. కెమెరా ప్రేక్షకుల కళ్లలా మారింది. మొత్తానికి హాయ్‌ నాన్న హాయ్‌ చెప్పి వెళ్లకుండా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.

కథ ఏంటంటే.. విరాజ్‌ ఓ బడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌.. ఓ పెద్ద ఫొటోగ్రాఫర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉంటాడు. అతడు యశ్న అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేని ఆమెను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని ఓ పాపను కూడా కంటాడు. ఆ పాప కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. అనేదే మిగితా కథ. మరి, హాయ్‌ నాన్న కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి