iDreamPost

లాజిక్ మిస్ అవుతున్న హీరోల ఫ్యాన్స్

లాజిక్ మిస్ అవుతున్న హీరోల ఫ్యాన్స్

సోషల్ మీడియా వచ్చాక అవసరం లేని భావోద్వేగాలన్నీ పబ్లిక్ ఊరికే ఆన్ లైన్లో బయటపెట్టుకోవడం ఎక్కువయ్యింది. ముఖ్యంగా సినిమా హీరోల అభిమానులు కొందరు వీటిని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు ఇంత అధమ స్థాయిలో జనం ఎలా ఆలోచిస్తారా అని బాధ పడేంత. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ట్విట్టర్ ని వేదికగా చేసుకుని చిరంజీవి అల్లు అర్జున్ ఫాన్స్ ఇద్దరూ చెరోవర్గంగా విడిపోయి దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆచార్య డిసెంబర్ 17న విడుదలయ్యే ఛాన్స్ ఉందని లీకులు బయటికి వచ్చిన నేపథ్యంలో ఈ గొడవ రాజుకుంది. ఇదే డేట్ ని కొద్దిరోజుల క్రితమే పుష్ప అఫీషియల్ గా అనౌన్స్ చేసి మరీ లాక్ చేసుకుంది. మరి ఇదెలా సాధ్యం.

దీని గురించి లోతుగా ఆలోచించకుండా పుష్ప గొప్పని వీళ్ళు ఆచార్య వస్తే ఎవరూ మిగలరని వాళ్ళు ఒకరిమీద ఒకరు మాములుగా రెచ్చిపోవడం లేదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చిన్న లాజిక్ కనిపిస్తుంది. పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కు మెగాస్టార్ తో మంచి బాండింగ్ ఉంది. బాబీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు. అదే పనిగా ఆచార్య తమకు పోటీ అవ్వాలని కోరుకోరు. అదే రీతిలో బన్నీ సినిమా బరిలో ఉండగా ఏమైతే అదయ్యింది, రిలీజ్ చేయమని చిరంజీవి కూడా చెప్పరు. అలాంటప్పుడు రెండూ 17నే రావడం ఆసాధ్యం. డిస్ట్రిబ్యూటర్లు సైతం వద్దనే అంటారు. కనీసం వారం పది రోజుల గ్యాప్ చాలా అవసరం

ఇదంతా మర్చిపోయి ఫ్యాన్స్ పిచ్చోళ్లలాగా ట్విట్టర్ లో ఇన్స్ టాలో ఫ్యాన్స్ ఇలా మాటల దాడులు చేసుకోవడం చూస్తే జాలి కలుగుతుంది. అసలు హీరోలకు లేని బాధ వీళ్ళకే వచ్చి పడినట్టు ఉంది. ఆచార్య, పుష్పలో ఏదో ఒకటి మాత్రమే 17 వస్తుంది. ఇది కన్ఫర్మ్. కాకపోతే చేతిలో ఉన్న 70 రోజుల్లో దర్శకుడు సుకుమార్ పుష్ప పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ కట్, సెన్సార్, ప్రమోషన్లు, పబ్లిసిటీ ఇవన్నీ బ్యాలన్స్ చేయాలి. షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. ఇవాళ రిలీజ్ చేసిన కొత్త సాంగ్ ప్రమోషన్ పోస్టర్ లో కూడా పుష్ప 17 అనే ఇచ్చారు. సో ఆచార్య రావడమే అనుమానం. మరి ఎవరు ఉంటారో ఎవరు డ్రాప్ అవుతారో వేచి చూడాలి

Also Read : ఇలాంటి కథతో సినిమా ఊహించగలమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి