iDreamPost

చరణ్ అభిమానులకు కిక్కిచ్చిన సూర్య

వందల కోట్లు ఖర్చు పెట్టినా 2.0 ఫలితం రోబో అంత గొప్పగా రాలేదు. విక్రమ్ తన ప్రాణాలే రిస్క్ లో పెట్టి చేసిన ఐ వైఫల్యాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. దానికి తోడు ఇండియన్ 2 సగం అయ్యాక ఆగిపోవడం, పలు అవాంతరాలు ఎదురు కావడం ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు టెన్షన్ కలిగించిన అంశాలే.

వందల కోట్లు ఖర్చు పెట్టినా 2.0 ఫలితం రోబో అంత గొప్పగా రాలేదు. విక్రమ్ తన ప్రాణాలే రిస్క్ లో పెట్టి చేసిన ఐ వైఫల్యాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. దానికి తోడు ఇండియన్ 2 సగం అయ్యాక ఆగిపోవడం, పలు అవాంతరాలు ఎదురు కావడం ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు టెన్షన్ కలిగించిన అంశాలే.

చరణ్ అభిమానులకు కిక్కిచ్చిన సూర్య

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ మీద ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదించిన వెంటనే ఆచార్య ఘోరంగా డిజాస్టర్ కావడంతో అర్జెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ పడాల్సిన అవసరాన్ని బాగా ఫీలవుతున్నారు. నిజానికి శంకర్ పెద్ద ఫామ్ లో లేడు. వందల కోట్లు ఖర్చు పెట్టినా 2.0 ఫలితం రోబో అంత గొప్పగా రాలేదు. విక్రమ్ తన ప్రాణాలే రిస్క్ లో పెట్టి చేసిన ఐ వైఫల్యాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. దానికి తోడు ఇండియన్ 2 సగం అయ్యాక ఆగిపోవడం, పలు అవాంతరాలు ఎదురు కావడం ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు టెన్షన్ కలిగించిన అంశాలే.

అందుకే ఈ సినిమా మీద కొంత ఆందోళన లేకపోలేదు. అయితే నిన్న చెన్నైలో జరిగిన విరుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య చెప్పిన మాటలు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉన్నాయి. దేశం మొత్తం ఆర్ సి 15 కోసం ఎదురు చూస్తోందని, దాన్నో గొప్ప స్థాయిలో శంకర్ తీర్చిదిద్దుతున్నారని స్టేజి మీదే పొగడ్తల వర్షం కురిపించారు. నిజానికి అక్కడ ఆ ప్రస్తావన అవసరం లేదు. కావాలంటే కమల్ హాసన్ ఇండియన్ 2 గురించి కూడా చెప్పొచ్చు. అయినా ప్రత్యేకంగా ఇలా చెప్పడం ద్వారాని కోలీవుడ్ లోనూ దీనికి హైప్ జోడించినట్టు అయ్యింది. చరణ్, రానా లాంటి టాలీవుడ్ హీరోస్ తో మంచి బాండింగ్ ఉన్న సూర్య వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కాసేపు పక్కన పెడితే విరుమాన్ తెలుగు వెర్షన్ ఆగస్ట్ 12న విడుదల కావడం అనుమానంగానే ఉంది. ఇంకా డబ్బింగ్ హక్కులు ఎవరికి ఇచ్చారో చెప్పలేదు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. కేవలం పది రోజుల గ్యాప్ లో బింబిసార, సీతారామం, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, లాల్ సింగ్ చడ్డాలు వచ్చేస్తున్నాయి. వీటి మధ్య డబ్బింగ్ మూవీ నిలవడం అంత సులభం కాదు. పైగా విరుమాన్ ట్రైలర్ చూశాక అందులో ఎలాంటి కొత్తదనం కనిపించడం లేదు. రొటీన్ విలేజ్ డ్రామా ఫీలింగ్ ఇస్తోంది. అలాంటప్పుడు రిస్క్ చేసి థియేటర్లకు తీసుకురావడం కన్నా తమిళ ఫలితం చూశాక డిసైడ్ అయితే బెటరనిపిస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి