iDreamPost

2024 సంక్రాంతికి అప్పుడే రిజర్వేషన్లు

2024 సంక్రాంతికి అప్పుడే రిజర్వేషన్లు

ఇంకో ఏడాది టైం ఉండగానే 2024 సంక్రాంతి మీద కర్చీఫ్ లు వేయాలని హీరోలు నిర్మాతలు తాపత్రయపడుతున్నారు. యావరేజ్ కంటెంట్లు సైతం స్టార్లు ఉంటే ఎంత భీభత్సంగా ఆడతాయో కళ్లారా చూశాక ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ ని వదలకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో పుష్ప 2 ది రూల్ మొదటిది. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ క్రేజీ సీక్వెల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాలకు వెళ్లే ప్లాన్ లో ఉంది టీమ్. ఏడాదికి పైగా కేవలం స్క్రిప్ట్ కోసమే సుకుమార్ టీమ్ చాలా కష్టపడి బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఎదురు చూసింది

ప్యాన్ ఇండియా రేంజ్ లో దీని మీద విపరీతమైన హైప్ తో పాటు భారీ బిజినెస్ ఆఫర్లు ఉండటంతో ఫస్ట్ పార్ట్ లాగా డిసెంబర్ లో కాకుండా జనవరికి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎలాగూ పదకొండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు పూర్తి చేయలేరు కాబట్టి అక్టోబర్ లోగా గుమ్మడి కాయ కొట్టేసి ఆ తర్వాత రెండు నెలలు పూర్తిగా పబ్లిసిటీకి కేటాయిస్తారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్ సి 15ని సైతం వారసుడు లాగా పండగ రేస్ లో దించాలనే ప్రణాళికతో ఎస్విసి టీమ్ ఉన్నట్టు తెలిసింది. ఇండియన్ 2 సమాంతరంగా చేస్తుండటంతో శంకర్ చరణ్ ప్రాజెక్ట్ మీదే పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు

ఒకవేళ ఇది నిజమైతే చరణ్ వర్సెస్ బన్నీ క్లాష్ చూడాల్సి ఉంటుంది. అంతే కాదు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలతో తలపడిన దిల్ రాజు నెక్స్ట్ మైత్రితో పుష్ప 2 మీద యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి వారు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ నడిపిస్తున్నారు కాబట్టి అండర్ స్టాండింగ్ లు గట్రా పెద్దగా ఉండకపోవచ్చు. పైగా రామ్ చరణ్ ది తెలుగు స్ట్రెయిట్ సినిమానే. దిల్ రాజుని అంత ఈజీగా కౌంటర్ చేయడానికి ఉండదు. అందుకే వీలైనంత త్వరగా ప్రకటనలు ఇచ్చేందుకు ఎవరికి వారు రెడీ అవుతున్నారట. తప్పదు మరి సమయం చాలా ఉన్నప్పటికీ ముందస్తు రిజర్వేషన్లు తప్పవు. ఈ రెండే కాదు ఫైనల్ గా ఇంకో ఇద్దరు ముగ్గురు తోడైనా ఆశ్చర్యం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి