iDreamPost

సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

కరోనా వల్ల ఓటీటీలకు ఆడియెన్స్ బాగా అడిక్ట్ అయిపోయారు. క్వాలిటీ కంటెంట్ అందుబాటులో ఉండటంతో ఓటీటీ సబ్​స్క్రిప్షన్ తీసుకునేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే గాక హాలీవుడ్​తో పాటు ఇతర విదేశీ భాషలకు చెందిన సినీ పరిశ్రమల నుంచి వచ్చే బెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్​లను కూడా స్ట్రీమింగ్​లోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. దీంతో ఓటీటీ సబ్​స్క్రైబర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. సినిమాలు బిగ్ స్క్రీన్స్​లో రిలీజవ్వడం ఎంత ముఖ్యమో ఓటీటీలో విడుదలవ్వడం కూడా ఇప్పుడే అంతే ముఖ్యమైపోయింది.

కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే ఓటీటీ డేట్ చెప్పి మరీ డిజిటల్ స్ట్రీమింగ్​కు వచ్చేస్తున్నాయి. మరికొన్ని మూవీస్ మాత్రం గప్​చుప్​గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ‘బాహుబలి’ ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ తనయుడు సీబీ సత్యరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘మాయోన్’ చిత్రం సడన్​గా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చి సర్​ప్రైజ్ ఇచ్చింది. ఆ చిత్రమే ‘హర్’. ఈ సినిమాలో ప్రముఖ నటి రుహాని శర్మ ప్రధాన పాత్రలో యాక్ట్ చేశారు.

‘హర్’ మూవీని శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్ట్ చేశారు. డబుల్ అప్ మీడియాస్​పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించిన ఈ చిత్రం.. జులై 21వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మంచి క్రైమ్ థ్రిల్లర్​ మూవీగా అప్లాజ్ తెచ్చుకున్న ‘హర్’ ఫిల్మ్ దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్​లో శుక్రవారం (సెప్టెంబర్ 15) అర్ధరాత్రి నుంచే ‘హర్’ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. హైదరాబాద్​ శివార్లలో జంట హత్యలు జరుగుతాయి. ఈ హత్యల వెనుక నిజాన్ని తెలుసుకునేందుకు ఏసీపీ అర్చనా ప్రసాద్ (రుహానీ శర్మ) రంగంలోకి దిగుతారు. ఈ కేసులో హంతకులు ఎవరు? వాళ్లను పట్టుకునే క్రమంలో అర్చనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తదితర విషయాలు తెరపై చూసి తెలుసుకోవాలి.

ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్​కు భారీ ఊరట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి