iDreamPost

రోహిత్ అంత రాణిస్తున్నా క్లాసెన్ వెనుకే.. ఆ విషయంలో సఫారీ బ్యాట్స్​మనే గొప్ప!

  • Author singhj Updated - 09:03 PM, Sat - 21 October 23

రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్.. మోస్ట్ డేంజరస్ ప్లేయర్ల లిస్టులో వీళ్లు పక్కాగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్-2023లో రెచ్చిపోయి ఆడుతున్నారు. మెరుపు ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నారు. అయితే రోహిత్ ఎంత బాగా ఆడుతున్నా ఒక విషయంలో క్లాసెన్ కంటే వెనుకపడ్డాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్.. మోస్ట్ డేంజరస్ ప్లేయర్ల లిస్టులో వీళ్లు పక్కాగా ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్-2023లో రెచ్చిపోయి ఆడుతున్నారు. మెరుపు ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నారు. అయితే రోహిత్ ఎంత బాగా ఆడుతున్నా ఒక విషయంలో క్లాసెన్ కంటే వెనుకపడ్డాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Updated - 09:03 PM, Sat - 21 October 23
రోహిత్ అంత రాణిస్తున్నా క్లాసెన్ వెనుకే.. ఆ విషయంలో సఫారీ బ్యాట్స్​మనే గొప్ప!

ప్రస్తుతం క్రికెట్​లో అత్యంత డేంజరస్ ప్లేయర్స్​లో రోహిత్ శర్మ ఒకడు. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడాల్లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. స్వింగ్, స్పీడ్, స్పిన్ అనే తేడాలు అతడికి ఉండవు. బాల్ పడిందా బౌండరీ దాటించాలి. ఇదే హిట్​మ్యాన్ సూత్రం. అటాకింగ్ బ్యాటింగ్​తో ప్రత్యర్థులను బెదరగొట్టే రోహిత్.. కెప్టెన్సీలోనూ ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్నాడు. బౌలర్లు రన్స్​ ఇస్తున్నా వారిపై నమ్మకం ఉంచి వికెట్లు తీసేలా ప్రోత్సహిస్తున్నాడు. వరల్డ్ కప్​లో ఈ ఫార్ములా సక్సెస్ అవుతోంది.

రోహిత్ కెప్టెన్సీ నాక్స్​ ఆడుతూ టీమిండియాలోని మిగిలిన బ్యాటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్​లో ఒక్క ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో తప్పితే మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ హిట్​మ్యాన్ బ్యాటింగ్​లో తన పవర్ చూపించాడు. అటాకింగ్ గేమ్​తో ప్రత్యర్థి బౌలర్ల ప్లాన్స్​ను చిత్తు చేస్తున్నాడు. రోహిత్ బ్యాట్ ఇలాగే గర్జిస్తే వరల్డ్ కప్​లో భారత్​ను ఆపడం కష్టమే. మెగా టోర్నీలో హిట్​మ్యాన్​ బ్యాట్​తో ఇంతగా రాణిస్తున్నా ఒక విషయంలో మాత్రం వెనుకపడ్డాడు. సౌతాఫ్రికా బ్యాటింగ్ సెన్సేషన్ హెన్రిచ్ క్లాసెన్​తో పోలిస్తే స్పిన్ బౌలింగ్​ను ఆడటంలో రోహిత్ వెనుకంజలో ఉన్నాడు.

2019 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే స్పిన్​ బౌలింగ్​ను దీటుగా ఎదుర్కొంటున్న వారిలో క్లాసెన్ ఫస్ట్ ప్లేసులో నిలిచాడు. స్పిన్​ను ఆడటంలో అతడి స్ట్రయిక్ రేట్ 132గా ఉంది. అతడి తర్వాతి ప్లేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ (125), డేవిడ్ మిల్లర్ (112) ఉన్నారు. ఈ లిస్టులో నాలుగో ప్లేసులో నిలిచాడు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ. అతని స్ట్రయిక్ రేట్ 106గా ఉంది. స్పిన్​ బౌలింగ్​లో రోహిత్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నా ఈ లిస్టులో వెనుకపడటానికి ఓ కారణం కనిపిస్తోంది. అదేంటంటే.. హిట్​మ్యాన్ ఓపెనింగ్ చేస్తాడు. వన్డేల్లో అతడు 15 ఓవర్లకు మించి ఎక్కువగా క్రీజులో ఉండడు. ఆ తర్వాతే స్పిన్నర్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

క్లాసెన్ మిడిలార్డర్​ బ్యాట్స్​మన్ అనేది తెలిసిందే. వన్డేల్లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్స్​ను ఫేస్ చేస్తుంటాడు. స్పిన్​లో స్పెషలిస్ట్ కాబట్టి అతడ్ని పక్కా ప్లాన్ ప్రకారమే మిడిల్ ఓవర్లలో ఆడిస్తుంటారు. సో, అతడికి స్పిన్ ఎటాక్​ను ఎదుర్కొనేందుకు ఛాన్స్ దొరుకుతోంది. అదే టైమ్​లో క్లాసెన్​ను తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే, మిగతా ఏ ఫారెన్ ప్లేయర్ ఆడని రీతిలో పర్ఫెక్ట్ టైమింగ్​, టెక్నిక్​తో స్పిన్​ను ఎదుర్కొని రన్స్ చేస్తున్నాడు. అతడి టాలెంట్​కు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే. మరి.. రోహిత్ ఇంత రాణిస్తున్నా స్పిన్ బౌలింగ్ స్ట్రయిక్ రేట్ విషయంలో క్లాసెన్ కంటే వెనుకంజలో ఉండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హెన్రిచ్ క్లాసెన్‌ సెంచరీ.. బౌలర్‌కు బుద్ధి చెబుతూ రెచ్చిపోయాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి