iDreamPost

తెలంగాణలో మరో మూడు వారాల పాటు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ

తెలంగాణలో మరో మూడు వారాల పాటు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ

కాసేపటికే భారీ వర్షం, మరికాసేపటికే ఎండ, మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు! రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడీ వింత వాతావరణం కనిపిస్తోంది. మరో మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.                    నైరుతి రుతుపవనాలకు అల్ప పీడనం తోడవడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు వారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి సీజన్ లోనమోదవ్వాల్సిన వర్షపాతంలో మూడింట రెండో వంతు ఒక్క జూలై నెలలోనే కురిసింది. ప్రధాన నదులు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నిండిపోయాయి. ఇంకా వానలు కురిస్తే వరదలొచ్చి జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదముంది. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి