iDreamPost

భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

దేశంలో ఓ వైపు వాతావరణం చల్లబడింది. మరో వైపు పగటి పూట వేడి చంపేస్తోంది. సాయంత్రం అయ్యే సరికి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆందోళన చెందుతున్నారు.

దేశంలో ఓ వైపు వాతావరణం చల్లబడింది. మరో వైపు పగటి పూట వేడి చంపేస్తోంది. సాయంత్రం అయ్యే సరికి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

పలు నగరాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నుండే చలికాలం చంపేస్తుంది. దీపావళికి ముందే చల్లని గాలులు వీస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఈ సమయంలో మరికొన్ని చోట్ల వర్షాలు పడుతూ.. భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదయం ఎండ దహించేస్తుంటే.. సాయంత్రం చలి పంజా విసురుతోంది. అంలోనే ముసురు పట్టి.. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ వింత వాతావరణాలను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది ప్రాంతాలను చలి గజగజలాడిస్తుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో వానలు కురియడంతో ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీరు రోడ్లపై చేరడంతో.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలనీల్లోకి వాన నీరు చేరడంతో బయటకు వెళ్లలేక ఇబ్బందులకు గురుతున్నారు ప్రజలు. అయితే రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. శనివారం నుండి సోమవారం వరకు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు స్టాలిన్ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి