iDreamPost

Prithviraj Sukumaran: నా డాటర్ కి గర్వంగా చూపిస్తాను.

ప్రిధ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్. ఈ సినిమా ఈ నెల వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రిధ్విరాజ్ ఈ సినిమా పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రిధ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్. ఈ సినిమా ఈ నెల వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా తాజాగా ప్రిధ్విరాజ్ ఈ సినిమా పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Prithviraj Sukumaran: నా డాటర్ కి గర్వంగా చూపిస్తాను.

మార్చి 28న వరల్డ్ వైడ్ రిలీజు కాబోతున్న ద గోట్ లైఫ్ కి ఆల్ లాంగ్వేజెస్లో వచ్చనంత పాప్యులారిటీ ఈ మధ్య రోజుల్లో మరే సినిమాకి రాలేదంటే అందులో అంత పెద్ద విచిత్రం ఏం లేదు. ప్రిధ్వీరాజ్ సుకుమారన్ చేయడం ఒకటైతే, ట్రైలర్ రిలీజవగానే ప్రభాస్ లాటి ఆలిండియా బాహుబలి దాని మీద గొప్పగా ట్వీట్ చేయడం, దానిక మళ్ళీ ప్రిధ్వీ రెస్పాండ్ అవడంతో వరల్డ్ వైడ్ సోషల్ మీడియా అంతా దద్దరిల్లి పోయింది. పైగా ట్రైలర్ లో విజువల్స్, కథలో కంటెంట్ ఇవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇటువంటి షస్టాఫిట్ష్ కైండ్ ఎక్సైట్ మెంట్ కోసమే ఏ లాంగ్వేజ్ అడియన్స్ అయినా ఎదురుచూసేది. అందుకే గోట్ లైఫ్ (ఆడు జీవితం) పెద్దపెట్టునే సందడి చేస్తోంది.

మొన్నీమధ్యనే గోట్ లైఫ్ ఆడియో లాంచ్ కొచ్చిలో జరిగింది. అందులోనే ఏఆర్ రెహ్మాన్ మొదటిసారి అందరికీ ట్రాక్స్, బిజిమ్స్ పరిచయం చేశాడు. అనంతరం జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ప్రిధ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, గోట్ లైఫ్ తనని ఒక మేకర్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో కన్నా, ఒక మనిషిగా తనని విపరీతంగా ప్రభావితం చేసిందని చెప్పాడు. ప్రతీ మాటా ఎక్సైట్ మెంట్ నిండిన ఒక ప్రత్యేకమైన ఎమోషన్తో మాట్లాడాడు. ‘’ ఎప్పుడో స్టార్ట్ చేశాం సినిమా. దాదాపు ఆరేళ్ళయింది. ఎన్నో కారణాలు. ఆగిపోతూ వచ్చింది ప్రాజెక్టు. ముఖ్యంగా కోవిడ్, లాక్ డౌన్స్ ఎక్కువ శాతం ఇబ్బంది పెట్టేశాయి. కానీ ఏం చెయ్యలేం.

I will proudly show it to my daughter

గతంలో నేను ఏ ప్రెస్ మీట్ కి వెళ్ళినా కూడా ఆడు జీవితం గురించే ప్రెస్ అడుగుతూ ఉండేవారు. సమాధానం చెప్పలేకపోయేవాడిని. ఇప్పుడు పూర్తి చేసి, ప్రమోషన్స్ లోకి రాగలిగాను. ఈ సినిమా గురించి బ్లెస్సీ,నేనూ ఎన్నో కలలు కన్నాం. రిలీజ్ కి గేరప్ అవుతోందంటే ఎంతో ఆనందంగా ఉంది. సినిమా ప్రారంభించే నాటికి నేను డైరెక్టర్ ని కాదు. అందరితో పోలిస్తే కొత్త నటుడిని. ఇంకా చెప్పాలంటే నేను భర్తనీ కాదు, తండ్రినీ అవలేదు. గోట్ లైఫ్ జర్నీలో ఎంతో మారిపోయింది. అందువల్లే ఈ జర్నీ నన్ను వ్యక్తిగతంగా ఎంతో ఎంతో ప్రభావితం చేసింది. డైరెక్టర్, నటుడు, ప్రొడ్యూసర్…ఇవన్నీ పక్కన పెడితే మనిషిగా నా జీవితం మీద ఈ సినిమా చాలా ప్రభావం చూపించింది. నా యాక్టింగ్ స్టయిల్, నేను సినిమాని చూసే విధానం, సినిమా పక్కనే సాగే జీవితం అన్నీ మారిపోయాయి.’’ అని చెప్పాడు.

ప్రిధ్వీకి 9 ఏళ్ళ పాప ఉంది. అలంక్రిత పేరు. తన కూతురికి తను చేసిన ఏ సినిమాని ప్రిధ్వీ ఇంతవరకూ చూపించలేదట. ఎందుకంటే ఏ సినిమా చూపించినా అలంక్రిత నాన్ననే చూస్తుంది తప్పితే సినిమాలో క్యారెక్టర్ కాదు అనేది ప్రిధ్వీ ఆలోచన. కానీ , ఇప్పుడు తన కూతురికి గోట్ లైఫ్ చూపించాలనుకుంటున్నాడు. ‘’ నేను చేసిన సినిమాలు ఏవీ నా డాటర్ చూడలేదు. నేను చూపించలేదు. నాన్ననే చూస్తుంది. నా క్యారెక్టర్ కాదు. కానీ గోట్ లైఫ్ మాత్రం తప్పకుండా చూపిస్తాను. గర్వంగా చూపిస్తాను. నా కూతురు నన్ను అడుగుతుంటుంది యాక్టింగ్ అంటే ఏమిటీ అని. యాక్టింగ్ కి నిర్వచనంగా, నిదర్శనంగా గోట్ లైఫ్ చూపిస్తాను.’’ అని చెప్పాడు ప్రిద్వీ. ఆరేళ్ళ ప్రయాణం, అడ్డంకులు, అవరోధాలు, అవాంతరాలు….కథలో ఎలా అయితే హీరో ట్రావెల్ టూ టఫ్ గా ఉంటుందో….గోట్ లైఫ్ పూర్తి చేసే ప్రయాణంలో కూడా ప్రిధ్వీ, బెస్లీ పడ్డ బాధలు కూడా అలాటివే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి