iDreamPost

షమీ ఆట తీరుపై స్పందించిన మాజీ భార్య! ఇప్పుడు దారికొచ్చింది..!

మహ్మద్ షమీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో విజృభిస్తున్న విషయం తెలిసిందే. అతని ప్రదర్శనపై మాజీ భార్య కీలక వ్యాఖ్యలు చేసింది.

మహ్మద్ షమీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో విజృభిస్తున్న విషయం తెలిసిందే. అతని ప్రదర్శనపై మాజీ భార్య కీలక వ్యాఖ్యలు చేసింది.

షమీ ఆట తీరుపై స్పందించిన మాజీ భార్య! ఇప్పుడు దారికొచ్చింది..!

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ ఫీవర్లో ఉన్నారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా టేబుల్ టాపర్ గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఆడిన 8 మ్యాచుల్లో 8 విజయాలు నమోదు చేసింది. 16 పాయింట్లు, +2.456 నెట్ రన్ రేట్ తో అప్రతిహితంగా కొనసాగుతోంది. ఈ విజయాలకు ప్రధాన కారణం బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా సమష్టిగా రాణించడమే. బ్యాటింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉందో.. బౌలింగ్ విభాగం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా బౌలర్లలో షమీ విజృభిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచుల్లో 16 వికెట్లతో చెలరేగాడు. షమీ ప్రదర్శనకు యావత్ దేశం నీరాజనాలు పడుతోంది. ఇప్పుడు మాజీ భార్య కూడా ఆ జాబితాలో చేరింది.

మహ్మద్ షమీకి ఈ వరల్డ్ కప్ సీజన్ లో తొలి మ్యాచుల్లో అవకాశం దక్కలేదు. కానీ, హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమైన తర్వాత షమీకి అవకాశం దక్కింది. అంది వచ్చిన అవకాశాన్ని షమీ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రత్యర్థులపై బాల్ తో చెలరేగాడు. 16 వికెట్లతో శభాష్ అనిపించుకున్నాడు. అతని ప్రదర్శనకు యావత్ క్రికెట్ ప్రపంచమే ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు షమీ మాజీ భార్య హసీనా జహాన్ కూడా స్పందించింది. ఓ డిబేట్ లో పాల్గొన్న ఆమె షమీ ప్రదర్శన గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. షమీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంది. అతను టీమిండియాలో కొనసాగాలి అంటూ కోరుకుంది. అయితే ఆమె వ్యాఖ్యల వెనుక ఇంకో బలమైన కారణం కూడా ఉంది.

అసలు ఆమె ఏం వ్యాఖ్యలు చేసిందంటే.. “షమీ బాగా ఆడితే టీమిండియాలో కొనసాగుతాడు. ఇంకా బాగా సంపాదిస్తాడు. అతను బాగా సంపాదిస్తే మాకు కూడా సురక్షితంగా ఉంటుంది. షమీ ఇంకా బాగా ఆడాలి” అంటూ హసీన్ జహాన్ ఆకాంక్షించింది. కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా షమీ- హసీనా జహాన్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె షమీపై కేసులు కూడా పెట్టింది. వీళ్లు దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే ఆమెకు షమీ నెలకు రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలని కూడా వెల్లడించింది. ప్రస్తుతం షమీ అదే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే షమీ ఇంకా బాగా ఆడాలి అంటూ కోరుకుంటోంది. హసీనా చేసిన పనితో అసలు మొత్తానికే షమీ కెరీర్ ముగిసిపోవాల్సింది. కానీ, షమీ న్యాయపోరాటం చేసి తన తప్పు లేదని అందరికీ తెలియజెప్పాడు. కోర్టు కూడా షమీకి ఊరటనిచ్చింది. మంచి ఫామ్ తో తిరిగి అతను టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వరల్డ్ కప్ లో ఎవ్వరూ ఊహించని విధంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు హసీనా జహాన్ వ్యాఖ్యలకు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతని కెరీర్ నాశనం అవ్వాలని కోరుకున్న ఆమే.. అతను బాగా ఆడాలని ఆకాంక్షిస్తోంది. ఇప్పుడు దారికొచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. షమీ ప్రదర్శనపై మాజీ భార్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి