iDreamPost

బాబుకు అమ‌రావ‌తి ఉసురు త‌గిలిందా? ఆగిన చోటే అరెస్ట్!

బాబుకు అమ‌రావ‌తి ఉసురు త‌గిలిందా? ఆగిన చోటే అరెస్ట్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతుంది. శుక్రవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయను విజయవాడకు తరలిస్తున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసుల. విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కి అమరావతి రైతుల ఉసురే తగిలిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ని ఏపీ సీఐడీ ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఉదయం నుంచి మీడియా మొత్తం చంద్రబాబు ఎపిసోడ్ నడుస్తుంది. మరికొద్ది సేపట్లో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చంద్రబాబు ని హాజరు పరుస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడి అరెస్టు కి ఎన్ని కారణాలు ఉన్నా.. అమరావతి రైతుల ఉసురు తాకింది అని కొంతమంది రైతులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కానీ వీరి పాదయాత్ర అర్థాంతరంగా ముగిసిపోయింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కేవలం ఆరువందల మంది మాత్రమే పాదయాత్ర చేయాల్సి వచ్చింది. రాజధానిపై అన్యాయం జరుగుతుంది.. ప్రభుత్వానికి తెలిసేలా మరోమారు పాదయాత్రను ప్రారంభించాలని అమరావతి జేఏసీ ఆలోచించినప్పటికీ.. చంద్రబాబు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు సమాచారం. అప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర ఉండటమే దానికి కారణం. ఒకేసారి రెండు పాదయాత్రలు అంటే ఖర్చు భరించడం కష్టమని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు తాము చేసిన పోరాటానికి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశలో ఉండిపోయారు అమరావతి రైతులు.

అలా అమరావతి రైతుల మనోభావవాలను చంద్రబాబు దెబ్బతినేలా చేశారని పలువురు అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన ఆందోళనకు అర్థం లేకుండా పోయిందని వాపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు తమకు చేసిన అన్యాయ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని కొంతమంది రైతులు అంటున్నారు. విధి రాత అంటే ఇదే.. రైతుల పాదయాత్ర ఆగిపోయిన ప్రాంతంలోనే లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ తో నిలిచిపోయినట్లు సమాచారం. గతంలో తాము ఎక్కడైతే పాదయాత్ర ఆపామో.. అక్కడే లోకేష్ పాదయాత్ర ఆటంకం ఎదురైందని.. అమరావతి రైతులు ఉసురే చంద్రబాబుకి తగిలిందని రైతులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి