iDreamPost

కుక్క కరిస్తే ఒక్కో కాటుకు రూ.10 వేల పరిహారం!

కుక్క కరిస్తే ఒక్కో కాటుకు రూ.10 వేల పరిహారం. అవును, మీరు విన్నది నిజమే. ఈ కుక్క కాటుకు రూ.10 వేలు ఇవ్వాలని ఏకంగా ఓ హైకోర్టు తీర్పును ఇవ్వడం విశేషం. ఇంతకు అసలు స్టోరీ ఏంటంటే?

కుక్క కరిస్తే ఒక్కో కాటుకు రూ.10 వేల పరిహారం. అవును, మీరు విన్నది నిజమే. ఈ కుక్క కాటుకు రూ.10 వేలు ఇవ్వాలని ఏకంగా ఓ హైకోర్టు తీర్పును ఇవ్వడం విశేషం. ఇంతకు అసలు స్టోరీ ఏంటంటే?

కుక్క కరిస్తే ఒక్కో కాటుకు రూ.10 వేల పరిహారం!

గత కొంత కాలం నుంచి వీధి కుక్కల బెడదతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు మరణించారు. ఈ వరుస ఘటనలపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. వీధి కుక్కల బెడద నుంచి అధికారులు ప్రజలను రక్షించాలని, ఇంతే కాకుండా వీటిని గ్రామాల్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, తాజాగా ఓ హైకోర్టు కుక్క కాటు బాధితులకు ఒక్కో కాటుకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇంతకు ఏ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది? అసలు స్టోరీ ఏంటంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలం నుంచి వీధి కుక్కల దాడిలో ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల నుంచి పెద్దల వరుకు వీటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇకపోతే.. అక్టోబర్ నెలలో వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) వీధి కుక్కలు ఆయన్ను వెంబడించాయి. దీంతో అతడు పరగెత్తి పరుగెత్తి ఓ చోట పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయన మృతితో సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. వీధి కుక్కల దాడి ఘటనలో ఇప్పటికీ ఎంతో మంది చనిపోయారని, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

ఇదిలా ఉంటే.. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసులపై తాజాగా హర్యానా-పంజాబ్ హైకోర్టు విచారించి తీర్పును వెలువరించింది. ఈ వరస కుక్క దాడి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కమిటీని వేసి పూర్తి విచారణ జరపాలని కోరింది. ఇంతే కాకుండా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఒక్కో పంటి కాటుకు రూ.10 వేలు చెల్లించాలని తీర్పును వెలువరించింది. ఇక 0.2 సెంటీమీటర్ల కోత పడితే మాత్రం రూ.20,000 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వీధి కుక్కలే కాకుండా ఎద్దులు, ఆవులు, గేదలు, గాడిదలు, ఇలా చాలా రకాల పెంపుడు జంతువులను కూడా ఇదే జాబితాలోకి చేర్చాలని పంజాబ్-హర్యానా హైకోర్టు సూచించింది. కుక్క కాటు బాధితులకు ఒక్క కాటుకు రూ.10 వేలు చెల్లించాలని తీర్పును వెలువరించిన హర్యానా-పంజాబ్ హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి