iDreamPost

19 ఏళ్ల యువకుడిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు.. ఎందుకంటే..?

బాల్యం, యవ్వనం అనేది ప్రతి ఒక్కరికి అందమైన దశ. ఈ దశలోనే ఓటమి, గెలుపుల గురించి తెలుసుకుంటారు. కానీ కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా.. కొంత మంది చిన్నారులు నిందితులుగా, నేరస్థులుగా మారిపోతున్నారు.

బాల్యం, యవ్వనం అనేది ప్రతి ఒక్కరికి అందమైన దశ. ఈ దశలోనే ఓటమి, గెలుపుల గురించి తెలుసుకుంటారు. కానీ కొన్ని సామాజిక పరిస్థితుల కారణంగా.. కొంత మంది చిన్నారులు నిందితులుగా, నేరస్థులుగా మారిపోతున్నారు.

19 ఏళ్ల యువకుడిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు.. ఎందుకంటే..?

సమాజంపై సినిమాలు ప్రభావం చూపిస్తాయో ఏమో తెలియదు కానీ, పరిస్థితులు మాత్రం మూకుమ్మడిగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా పసి హృదయాలపై. నేటి బాలలే రేపటి పౌరులు అన్న వ్యాఖ్యలకు పునాది బాల్యమే. చిన్నారులకు మెరుగైన బాల్యం, యవ్వనం అందించగలిగితేనే.. కుటుంబానికే కాదూ.. దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంటారు. కానీ ఇంట్లోని, సమాజంలోని పరిస్థితుల ప్రభావం కారణంగా కొంత మంది సంఘ విద్రోహ శక్తులుగా, రౌడీలుగా, గూండాలుగా తీర్చిదిద్దబడుతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీలను చేతబట్టి.. హింసలకు తెరలేపుతున్నారు. గ్యాంగ్ స్టర్స్‌గా మారుతున్నారు.

ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న ఈ యువకుడిని చూడండి.. ఇంకా నూనుగు మీసాలు కూడా సరిగా రాలేదు. కానీ అతడిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కరుడుగట్టిన నేరస్థులకు దేశం విడిచి పెట్టి వెళ్లిపోకుండా ఉండేందుకు ఈ నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. నిండా 20 ఏళ్లు నిండని ఈ కుర్రాడికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఇంటర్ పోల్. ఇంతకు అతడు ఎవరంటే.. హర్యానా గ్యాంగ్ స్టర్ యోగేశ్ కద్యాన్. అతనిపై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద పలు కేసులున్నాయి. చిన్న వయస్సులోనే నేరాలకు పాల్పడుతూ.. అనంతరం పోలీసుల నుండి తప్పించుకునేందుకు అమెరికా పారిపోయి ఆ శ్రయం పొందుతున్నాడని సమాచారం.

అమెరికాలో ఉన్న బాబినా గ్యాంగ్‌లో ప్రస్తుతం అతను పనిచేస్తున్నాడు. 17 ఏళ్ల వయస్సులో యోగేశ్.. అమెరికాకు నకిలీ పాస్ పోర్టుతో వెళ్లినట్లు సమాచారం. అతడికి ఖలీస్తాని ఉగ్రవాదులతోనూ లింకులు ఉన్నాయి. 19 ఏళ్ల యోగేష్ తలపై రూ. 1.5 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం. మరో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయకుడు సిద్దు మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు లారెన్స్. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో యోగేశ్ కద్యాన్ ఎప్పుడైనా భారత్‌కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి