iDreamPost

IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్.. ముంబై ఇండియన్స్‌లోకి పాండ్యా?

  • Author Soma Sekhar Published - 09:01 PM, Fri - 24 November 23

గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే సీజన్ లో ముంబై ఇండిన్స్ తరఫున ఆడనున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే సీజన్ లో ముంబై ఇండిన్స్ తరఫున ఆడనున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 09:01 PM, Fri - 24 November 23
IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్.. ముంబై ఇండియన్స్‌లోకి పాండ్యా?

ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఏఏ ఆటగాళ్లను వదులుకోవాలి? ఎవరెవరిని కొనుగోలు చేయాలి? అన్న విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి ఒక బిగ్ న్యూస్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే సీజన్ లో ముంబై ఇండిన్స్ తరఫున ఆడనున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి. క్రికెట్ వర్గాల్లో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఐపీఎల్.. క్రికెట్ లవర్స్ ను ఫోర్లు, సిక్సర్లతో ఊర్రూతలూగించే క్యాష్ రిచ్ లీగ్. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి ఫ్రాంచైజీలు. తమ ప్రణాళికల్లో భాగంగా ఏ ఆటగాడిని వదులుకోవాలి? ఏ ప్లేయర్ ను కొనుగోలు చేయాలి? అన్న విషయాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఓ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. అదేంటంటే? గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం. ట్రేడ్ రూపంలో అతడ్ని దక్కించుకునేందుకు నీతా అంబానీ ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. పాండ్యాకు బదులుగా ముంబై టీమ్ జోఫ్రా ఆర్చర్ ని ట్రేడ్ రూపంలో వదులుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిగ్ డీల్ ఓకే అయినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. 2022 ఐపీఎల్ మెగా వేలంలో పాండ్యా కోసం గుజరాత్ రూ. 15 కోట్లు వెచ్చించగా.. జోఫ్రా ఆర్చర్ కోసం ముంబై రూ. 8 కోట్లు పెట్టింది. అయితే ఇంత భారీ ధర పలికిన ప్లేయర్లు ట్రేడ్ ద్వారా బదిలీ కావడమనేది ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ డీల్ గనక ఓకే అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద డీల్ కానుంది. కాగా.. యాజమాన్యాలు పరస్పరం ట్రేడ్ చేసుకున్నా.. వేలం ప్రకారంమే వీరికి ఫీజులు చెల్లిస్తాయి. మరి ముంబై ఇండియన్స్ టీమ్ లోకి పాండ్యా చేరబోతున్నాడన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి